నాలుగో మ్యాచ్లో అలా చేయండి.. విలువైన సలహా ఇచ్చిన గవాస్కర్?

praveen
ప్రస్తుతం భారత్ ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది. ఈ క్రమంలోనే అహ్మదాబాద్ వేదికగా చివరి నాలుగో టెస్ట్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ టెస్ట్ మ్యాచ్ గురించి అందరూ చర్చించుకుంటున్నారు. అయితే మూడో మ్యాచ్లో టీమిండియా గెలిచి ఉంటే ఇంత చర్చ ఉండేది కాదేమో కానీ మూడో మ్యాచ్లో టీమిండియా ఓడిపోయింది. అప్పటికే రెండు మ్యాచ్లు గెలిచిన టీమ్ ఇండియా మూడో మ్యాచ్లో గెలిచి సిరీస్ కైవసం చేసుకుంటుంది అనుకున్నప్పటికీ అటు ఆస్ట్రేలియా పుంజుకొని మూడో మ్యాచ్లో గెలిచి సిరీస్ అవకాశం సజీవంగా ఉంచుకుంది అని చెప్పాలి.

 దీంతో టెస్ట్ సిరీస్ గెలవాలంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగు పెట్టాలంటే.. నాలుగో టెస్ట్ మ్యాచ్లో గెలవడం టీమ్ ఇండియాకు ఎంతో కీలకమైనది. ఎవరి ప్రదర్శన ఎలా ఉంటుంది అనేదానిపై ఇప్పటికే మాజీ ఆటగాళ్లు తమ రివ్యూలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చేస్తున్నారు అని చెప్పాలి. అహ్మదాబాద్ లో జరగబోయే నాలుగో టెస్ట్ కోసం భారత బ్యాట్స్మెన్ లకు విలువైన సలహా ఇచ్చాడు లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. ప్రత్యర్థి స్పిన్నర్లను ఎదుర్కొనేటప్పుడు భారత బ్యాట్స్మెన్లు కొద్దిగా చివర్లో పట్టుకుని ఇంకాస్త వంగి ఆడాలి అంటూ సూచించాడు.

 మూడవ మ్యాచ్ లో ఆస్ట్రేలియా స్పిన్నర్ల దెబ్బకు భారత బ్యాటింగ్ విభాగం చేతులెత్తేసిన నేపథ్యంలో  ఇక ఇలాంటి సూచన చేశాడు. స్పిన్ పిచ్ లపై బంతిని ఎదుర్కొనేటప్పుడు బ్యాట్ ని పట్టుకునే తీరు ఎంతో ముఖ్యం. హ్యాండిల్ కాస్త పైన పట్టుకోవాలి. దీనివల్ల హ్యాండ్ తో బ్యాడ్ ను సులభంగా తిప్పేందుకు అవకాశం ఉంటుంది. బాటమ్ హ్యాండ్ తో వేగంగా షాట్స్ కూడా ఆడేందుకు ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు అనుకున్న సమయంలో బ్యాట్ ను కిందకు దింపే అవకాశం కూడా ఉంటుంది. ప్యాడ్లకు అడ్డంగా షాట్లు ఆడొచ్చు ఇక స్పిన్ పిచ్ లపై బంతిని ఎదుర్కోవాలంటే మాత్రం కొంచెం వంగి బ్యాటింగ్ చేయాలి. అప్పుడు ఇంకా కాస్త బంతి లైన్ ఆఫ్ ను చూసేందుకు అవకాశం ఉంటుంది. నాలుగో మ్యాచ్లో భారత బ్యాట్స్మెన్లు ఇదే టెక్నిక్ పాటిస్తే బాగుంటుంది అంటూ సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: