షాకీబ్ ఉల్ హసన్ అరుదైన రికార్డ్.. ప్రపంచ క్రికెట్లో మూడో ప్లేయర్?

praveen
ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమమైన ఆల్ రౌండర్లు ఎవరు అనే చర్చ జరుగుతున్న సమయంలో ఇక క్రికెట్ ప్రేక్షకులకు మొదటగా గుర్తు వచ్చే పేరు బంగ్లాదేశ్ కెప్టెన్ షాకీబ్ ఉల్ హసన్  తన ఆట తీరుతో ఇప్పటికే ప్రపంచ క్రికెట్లో అద్భుతం ఆల్ రౌండర్ గా నిరూపించుకున్నాడు. అంతేకాదు ఐసీసీ ర్యాంకింగ్స్ లో కూడా ఆల్రౌండర్ల జాబితాలో నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. ఇక బౌలింగ్లో బ్యాటింగ్లో కూడా తనకు తిరుగులేదు అనే విధంగానే సత్తా చాటుతూ ఉంటాడు షాకీబ్ ఉల్ హసన్. ఇక జట్టుకు కెప్టెన్ గా కూడా తన నాయకత్వ ప్రతిభతో ఎన్నో విజయాలను అందించాడు అని చెప్పాలి.

 బౌలింగ్లో సత్తా చాటుతు కీలకమైన సమయంలో వికెట్లు పడగొడుతూ ఉండే షాకీబ్ ఉల్ హసన్.. ఇక బ్యాటింగ్లో కూడా స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ తరహాలో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ పరుగుల వరద పారీస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఇక అటు బంగ్లాదేశ్ జట్టు ఎప్పుడు మ్యాచ్ ఆడిన కూడా జట్టులో ఉన్న అందరికంటే అతని ప్రదర్శన ఎప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోతూ ఉంటుంది. అయితే ఇప్పుడు వరకు షాకీబ్ ఉల్ హసన్ ప్రదర్శనతో ఎన్నో రికార్డులు సాధించిన షాకీబ్ ఉల్ హసన్ ఇటీవల మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు అని చెప్పాలి.

 ప్రస్తుతం బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగుతుంది అని చెప్పాలి. నువ్వా నేనా అన్నట్లుగా జరుగుతున్న ఈ పోరు అటు క్రికెట్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. అయితే ఇటీవలే బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే లో మంచి ప్రదర్శన చేసిన షాకీబ్ ఉల్ హసన్ అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే ఫార్మాట్లో ఆరువేలకు పైగా పరుగులు 300 వికెట్లు తీసిన మూడవ ఆల్రౌండర్ గా నిలిచాడు అని చెప్పాలి. ఇక అంతకుముందు శ్రీలంక మాజీ ప్లేయర్ సనత్ జయసూర్య 13,430 పరుగులు 323 వికెట్లు తీశాడు. ఇక పాకిస్తాన్ మాజీ ప్లేయర్ షాహిద్ ఆఫ్రిది 8064 పరుగులు 395 వికెట్లు పడగొట్టాడు. ఇక ఎప్పుడు షాకీబ్ ఉల్ హసన్ 6976 పరుగులు 300 వికెట్లతో అరుదైన మైలురాయిని అందుకున్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: