ఇండియా టెస్ట్ సీరీస్ గెలుస్తుందా... డ్రా చేసుకుంటుందా ?

VAMSI
ఇండియాలో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మూడు టెస్ట్ లు పూర్తి అయ్యాయి. ప్రస్తుతం ఇండియా 2-1 తో ఆధిక్యంలో ఉంది. మొదటి రెండు టెస్ట్ లలో పూర్తి ఆడిపాహ్యాన్ని కనబరిచిన ఇండియా... మూడవ టెస్ట్ లో మాత్రం దారుణంగా ఫెయిల్ అయింది. ముఖ్యంగా బ్యాటింగ్ లో ప్రతి ఒక్కరూ ఫెయిల్ అవ్వడం యాజమాన్యాన్ని కలవరపెడుతోంది. మాములుగా ఉపఖండంలో పరదేశీయలు టెస్ట్ ను గెలుచుకోవడం చాలా కష్టం.. అది కూడా ఇండియాలో గెలవడం మరీ కష్టం. కానీ ఆస్ట్రేలియా దెబ్బతిన్న పులిలా మూడవ టెస్ట్ లో తమ శక్తిని అంత కూడగట్టుకుని బరిలోకి దిగి కెప్టెన్ స్టీవెన్ స్మిత్ సారధ్యంలో విజయాన్ని నమోదు చేసి సిరీస్ ను మరింత ఆసక్తికరంగా మార్చింది.
ఈ టెస్ట్ లో ఇండియా టీం లో ప్లేయర్ పరంగా ప్రదర్శన చూస్తే పుజారా బ్యాటింగ్ లో రెండవ ఇన్నింగ్స్ లో అర్ద సెంచరీతో పర్వాలేదు అనిపించదు. ఇక మరెవ్వరూ కూడా బ్యాటింగ్ లో ఆస్ట్రేలియా స్పిన్ ను ఎదుర్కోలేకపోయారు. ఆఖరికి కెరీర్ లో రెండవ టెస్ట్ ఆడుతున్న యంగ్ స్పిన్నర్ కూనేమాన్ బౌలింగ్ ను కూడా ఆడలేక ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన ప్లేయర్స్ వికెట్ ను సమర్పించుకున్నారు. ఇక బౌలింగ్ లో అశ్విన్ , జడేజా మరియు ఉమేష్ యాదవ్ లు రాణించారు. రెండవ ఇన్నింగ్స్ లో మరీ తక్కువ లీడ్ ఉండడంతో కష్టం అయింది.. కానీ ఒక 200 లోపు పరుగులు ఉండి ఉంటే ఖచ్చితంగా ఆస్ట్రేలియా పై ఒత్తిడి పెంచే ప్రయత్నం జరిగేది.
ఇక మిగిలింది అహ్మదాబాద్ లో జరగనున్న నాలుగవ టెస్ట్ సిరీస్ ఫలితాన్ని తేల్చనుంది. ఇండియా గెలిస్తే 3 -1 తేడాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ని గెలుచుకుంటుంది. ఒకవేళ ఆస్ట్రేలియా మరోసారి పంజా విసిరితే సిరీస్ 2 -2 తో సమం అవుతుంది. ఇదే కనుక జరిగితే ఇండియాకు సిరీస్ ను కోల్పోయినంత పని అవుతుంది. మరి ఇండియా ఎలా ఆడనుంది అనేది తెలియాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: