టీమిండియా పై.. ఆస్ట్రేలియా బౌలర్ లియాన్ అరుదైన రికార్డ్?

praveen
ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా మూడో మ్యాచ్లో టీమ్ ఇండియా జట్టు తడబడింది అని చెప్పాలి. మొదటి రెండు మ్యాచ్లలో స్పిన్ బౌలింగ్ పుణ్యమా అని.. జట్టులో బ్యాటింగ్  వైఫల్యం ఉన్నప్పటికీ కూడా విజయాలు సాధించిన టీమ్ ఇండియా జట్టు అటు మూడో టి20 మ్యాచ్ లో మాత్రం ఇక ఆస్ట్రేలియాకు గట్టి పోటీ ఇవ్వలేకపోయింది అని చెప్పాలి. గత రెండు టెస్ట్ మ్యాచ్ లలో ఏ స్పిన్ బౌలింగ్తో అయితే భారత జట్టు ఆస్ట్రేలియను దెబ్బ కొట్టిందో.. ఇక ఇప్పుడు మూడో టెస్ట్ మ్యాచ్లో అదే స్పిన్ బౌలింగ్ ఉచ్చులో ఇరుక్కుని టీమిండియా విలవిలలాడిపోయింది అని చెప్పాలి.

 ఇక మూడో టెస్ట్ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లో కూడా అటు ఇండియా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ఈ క్రమంలోనే పటిష్టమైన ఇంగ్లాండు ముందు కేవలం స్వల్ప టార్గెట్ మాత్రమే ఉంది అని చెప్పాలి. దీంతో ఇక నేడు జరగబోయే ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో జట్టును గెలిపించే భారమంతా కూడా బౌలర్ల పైనే ఉంది. ఏం జరగబోతుంది అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇక టీమిండియా బౌలింగ్ విభాగాన్ని పేక మేడలా కూల్చింది ఆస్ట్రేలియాలో స్టార్ స్పిన్నర్గా కొనసాగుతున్న నాథన్ లియోన్ అని చెప్పాలి. ఏకంగా మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో ఎనిమిది వికెట్లతో సత్తా చాటాడు. ఈ క్రమంలోనే సరికొత్త రికార్డును సృష్టించాడు నాథన్ లియోన్.

 టీమ్ ఇండియా పై అత్యధిక సార్లు ఐదు వికెట్లు తీసిన బౌలర్గా నాథన్ లియోన్ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ స్టార్ స్పిన్నర్ భారత జట్టుపై ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం ఇది 9వ సారి కావడం గమనార్హం. అయితే శ్రీలంక స్పిన్నర్ మురళీధరన్ భారత్ పై ఎనిమిది సార్లు 5 వికెట్ల మార్కు అందుకున్నాడు. ఇప్పటివరకు ఇదే అత్యధికంగా ఉండగా.. ఇక ఇప్పుడు మూడో టెస్ట్ లో 8 వికెట్లు తీసి ఏకంగా తొమ్మిది సార్లు 5 వికెట్ల మార్క్ అందుకున్న ప్లేయర్గా రికార్డర్ సృష్టించాడు లియోన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: