గిల్.. కాసేపు గాయం ఓర్చుకొని ఉంటే ఏం పోయేది?

praveen
ప్రస్తుతం భారత్ ఆస్ట్రేలియా మధ్య ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ ఎంతో ఆసక్తికరంగా జరుగుతూ ఉంది అని చెప్పాలి . అయితే ఇప్పటికే ముగిసిన రెండు మ్యాచ్లలో కూడా అటు టీమిండియా విజయం సాధించి సత్తా చాటింది. ఇకపోతే అటు మూడో మ్యాచ్లో మాత్రం టీమిండియా ఎందుకో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోతోంది అనే విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా బౌలర్ల దాటికి మొదటి ఇన్నింగ్స్ లో పూర్తిగా చేతులెత్తేసింది టీమిండియా జట్టు.

 అదే సమయంలో గత రెండు టెస్ట్ మ్యాచ్ లలో కూడా భారత స్పిన్ బౌలింగ్ దాటికీ ఉప కూలిపోయిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ విభాగం ఇక ఇప్పుడు ఆచితూచి  ఆడుతూ ఉంది అని చెప్పాలి. అయితే ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కోసం జట్టులో ఎంపిక అయినప్పటికీ శుభమాన్ గిల్ అటు తుది జట్టులోకి మాత్రం రాలేదు. అయితే కేఎల్ రాహుల్ పేలవమైన ప్రదర్శన చేసిన నేపథ్యంలో ఇక అతన్ని పక్కన పెట్టి మంచి ఫామ్ లో ఉన్న గిల్ ని మూడో టెస్ట్ మ్యాచ్లో జట్టులోకి తీసుకున్నారు. కానీ అతను కూడా పూర్తిగా నిరాశపరిచాడు అని చెప్పాలి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

 ఇక మ్యాచ్ మధ్యలో శుభమన్ కి గాయమైంది. ఇక ఇదే విషయంపై ఇటీవల భారత క్రికెట్ దిగ్గజం  సునీల్ గావాస్కర్ స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నిన్నటి ఇన్నింగ్స్ లో శుభమన్ గిల్ మధ్యలో ఫిజియోని పిలవడమే ఇందుకు కారణం అని చెప్పాలి. నువ్వు మరో రెండు బంతులు పూర్తయ్యే వరకు ఓర్చుకొని ఉంటే బాగుండేది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఫిజియోని పిలవడంతో బౌలర్కు విశ్రాంతి ఇచ్చినట్లు అయింది అంటూ సునీల్ గవాస్కర్  అభిప్రాయపడ్డాడు. అయితే మీరు చాలా కఠినంగా ఉన్నారు అంటూ ఈ వ్యాఖ్యల తర్వాత మ్యాచ్ లో సునీల్ గవాస్కర్ పై కామెంట్ చేశాడు మాథ్యూ హెడెన్ .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: