పాపం.. ఆ ఒక్క నిర్ణయంతో చెత్త రికార్డు మూట గట్టుకున్న ఇంగ్లీష్ జట్టు?

praveen
టెస్ట్ క్రికెట్ లో మరొకసారి సంచలనం నమోదు అయ్యింది. ఇంగ్లాండ్ జట్టు తీసుకున్న ఒక సొంత నిర్ణయం ఆ జట్టుకు ఓటమిని మిగల్చడం తో పాటు ఒక చెత్త రికార్డు ని కూడా దక్కేలా చేసింది. అసలు విషయంలోకి వెళ్తే ఇంగ్లాండ్ మరియు న్యూ జేఅలాండ్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే మొదటి టెస్ట్ మ్యాచ్ ని ఇంగ్లాండ్ జట్టు నెగ్గి 1-0 తో ముందుకు వెళ్తున్న క్రమం లో రెండవ టెస్ట్ మ్యాచ్ లో మాత్రం ఇంగ్లాండ్ ఒక్క పరుగు  తేడాతో ఓడిపోయింది. మొదటి టెస్ట్ మ్యాచ్ లో 267 పరుగులతో భారీ విజయాన్ని దక్కించుకున్న ఇంగ్లాండ్ జట్టు రెండవ మ్యాచ్ ని సైతం గెలవాల్సి ఉంది.
అయితే ఫాలోఆన్ ఆడి మరి ఓడిపోయిన జట్టు గా ఇంగ్లాండ్ వరెస్ట్ రికార్డు కి ఎక్కింది.  రెండవ టెస్ట్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కి దిగిన ఇంగ్లాండ్ జట్టు 8 వికెట్స్ పోగొట్టుకొని 435 పరుగులు సాధించి మొదటి ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేసింది. అయితే ఆ తర్వాత బ్యాటింగ్ కి దిగిన న్యూజిలాండ్ 209 పరుగులకు ఆల్ అవుట్ అయ్యారు.దంతి బ్యాటింగ్ కి దిగాల్సిన ఇంగ్లిడ్ టీమ్ ఆలా చేయకుండా న్యూ జిలాండ్ టీమ్ ని ఫాలోఆన్ ఆడించాలని నిర్ణయించుకోవడం తో ఆ జట్టు 483 పరుగులకు ఆల్ అవుట్ అయ్యారు. ఇక భారీ స్కోర్ చేసిన న్యూ జిలాండ్ పై గెలవాలంటే ఇంగ్లీష్ టీమ్ 258 పరుగుల లక్ష్యం ఉంది.
కానీ 256 పరుగుల వద్ద ఇంగ్లాండ్ అన్ని వికెట్స్ కోల్పోవడం తో కేవలం ఒకే ఒక్క పెరుగుతు మ్యాచ్ తమ చెయ్యి జారిపోయింది. ఇలా ఫాలోఆన్ ఆడించి ఓడిపోయినా రెండవ జట్టుగా నిలబడింది.  ఇంతకు ముందు ఆస్ట్రేలియా జట్టు సైతం ఆత్మవిశ్వాసం మూడు సార్లు ఫాలోఆన్ ఆడించి ఓటమి చవి చూసింది. మొదటి సారి ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ టీమ్ పై తొలిసారి ఫాలోఆన్ ఆడించి 10 పరుగుల తేడాతో ఓడిపోయి తొలిసారి ఒక చెత్త రికార్డు సృష్టించగా, రెండవ సారి సైతం 1981 లో ఇంగ్లాండ్ జట్టుతోనే మళ్లీ 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక చివరగా 2001 లో ఇండియా తో ఫాలోఆన్ ఆడించి ఆస్ట్రేలియా జట్టు ఓటమిని చూడాల్సి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: