ఫుల్ ఖుషి లో సన్ రైజర్స్ ఫ్యాన్స్ .. ఎందుకో తెలుసా?

praveen
క్రికెట్ అభిమానులను ఎంటర్టైన్ చేయడానికి ఐపీఎల్ 2023 రాబోతోంది. ఇంకా ఈ సీజన్ ప్రారంభం కావడానికి నెలరోజుల సమయం ఉండగానే అప్పుడే అభిమానులు అంతా కూడా ఆనందంలో మునిగి తేలుతున్నారు. అందుకు కారణం ఏంటంటే సన్ రైజర్స్ టీం కి కెప్టెన్ గా ప్రస్తుతం మార్క్రమ్  ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే నిన్న జరిగిన సౌత్ ఆఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ లో మార్క్రమ్ సెంచరీ బాదేశాడు. అందువల్లే సన్ రైజర్స్ టీం అభిమానులంతా కూడా ఆనందంలో మునిగి తేలుతున్నారు. మార్క్రమ్ మంచి ఫామ్ లో ఉండడంతో తెలుగు వారందరికీ పండగ చేసుకున్నంత సంబరంగా ఉంది.
ఇదే ఫాం కొనసాగించి సన్ రైజర్స్ టీం ని కూడా విజయాల బాట పట్టిస్తాడని తెలుగు అభిమానులు అంతా కూడా కోరుకుంటున్నారు. చాలా సీజన్స్ గా ఆ సన్ రైజర్స్ టీమ్ చతికల పడుతూ ఆడుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక మార్క్రమ్ ఖచ్చితంగా మన టీం టాప్ ప్లేస్ లో కొ నిలుపుతాడని అని అంతా భావిస్తున్నారు. ఇక మార్క్రమ్ పై అంచనాలు పెరగడానికి గల మరో కారణం ఏమిటి అంటే మొన్నటికి మొన్న ముగిసిన దక్షిణాఫ్రికా t20 లీగ్ లో సన్ రైజర్స్ యొక్క మరొక ఫ్రాంచైజ్ ఈస్టర్న్ కేఫ్ నీ కూడా విజయపథంలో నిలిపాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికా లో 2 టెస్టులు, 3 వన్డేలు 3 t20 లు ఆడడానికి వెస్టిండీస్ పర్యటిస్తోంది. ఇందులో భాగంగానే మొదటి టెస్ట్ ప్రారంభం కాగా మొదటి రోజే మార్క్రమ్ సెంచరీ కొట్టాడు. తొలుత బ్యాటింగ్ కి దిగిన దక్షిణాఫ్రికా ఏడు వికెట్లు నష్టపోయి 296 పరుగులు చేసింది. తొలి వికెట్ బాగాస్వామ్యం 141 పరుగులు కాగా ఆ తర్వాత త్వరత్వరగా వికట్టు చేజార్చుకోవడంతో భారీ స్కోర్ చేసే అవకాశం లేకుండా పోయింది. వెస్టిండీస్ బౌలర్లు సమర్ధవంతంగా బౌలింగ్ చేయడంతో అతి తక్కువ స్కోరుతో  సఫారీ మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసెఫ్ 3 వికెట్లు తీసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: