ఇండోర్లో గెలిస్తే.. అహ్మదాబాద్ లో అలా చేస్తాం : రోహిత్

praveen
ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగూ మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో టీమిండియా జట్టు జోరు కనబరుస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే స్వదేశీ పరిస్థితిలను సద్వినియోగం చేసుకుంటూ వరుసగా విజయాలు సాధిస్తూ ఉండే టీమిండియా జట్టు ఇప్పటికే రెండు మ్యాచ్ లలో కూడా విజయాలు సాధించింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మూడో మ్యాచ్లో ఎవరు పై చేయి సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఇక ఇప్పుడు వరకు మ్యాచ్లు జరిగిన నాగపూర్ ఢిల్లీ వేదికలో కూడా స్పిన్ పిచ్ లను తయారు చేసి అటు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లను బోల్తా కొట్టించింది టీమ్ ఇండియా జట్టు. ఇక ఇండోర్లో కూడా స్పిన్ పిచ్ తయారు చేసింది అన్న విషయం తెలిసిందే.

 దీన్నిబట్టి చూస్తే మరోసారి భారత స్పిన్ విభాగం అటు ఆస్ట్రేలియా పై మరోసారి అటాచ్ చేయడానికి సిద్ధంగా ఉంది అని తెలుస్తుంది. అయితే ఇక మూడో టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా సిరీస్ కైవసం చేసుకోవడమే కాదు.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కూడా అడుగుపెడుతుంది టీమ్ ఇండియా. అయితే ఇక ఇలా డబ్ల్యుటిసి ఫైనల్ ఎంతో కీలకం. ఎందుకంటే ఇప్పుడు స్పిన్ పిచ్ లపై అదరగొడుతున్న టీమ్ ఇండియా లండన్ లో ఫేస్ పిచ్ లపై ఆడాల్సి ఉంటుంది. ఇక ఇదే విషయంపై ఇటీవలే రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ ఇండోర్ పిచ్ లో మేము అనుకున్న ఫలితం వస్తే ఇక అహ్మదాబాద్ లో పిచ్ పై భిన్నంగా ఆలోచన చేస్తాం అంటూ చెప్పుకొచ్చాడు.

 డబ్ల్యూటీసి ఫైనల్ అనేది కాస్త భిన్నంగా ఉంటుంది. అది కూడా లండన్ వేదికగా ఆస్ట్రేలియాతో తలబడాల్సి వచ్చే ఛాన్స్ ఉంది. పేస్ పిచ్ తగ్గట్టుగా ప్రాక్టీస్ చేసేందుకు అహ్మదాబాద్ వేదికగా జరగబోయే నాలుగవ టెస్ట్ వేదికను తయారు చేయాలని ఇప్పటికే మేము చర్చించుకున్నాం. అయితే ఇది మూడవ టెస్ట్ ఫలితం పైన ఆధారపడి ఉంటుంది అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. డబ్ల్యూటీసి ఫైనల్ లో మా ప్లానింగ్ లో శార్దూల్  ఠాగూర్ కూడా ఉన్నాడు. అతడు కూడా వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు. చూడాలి అతడు ఎన్ని ఓవర్లు బౌలింగ్ వేయగలడో అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: