WPL : ముంబై ఇండియన్స్ జెర్సీ చూశారా?

praveen
మహిళ క్రికెట్ ను ప్రోత్సహించడమే లక్ష్యంగా బీసీసీఐ గత కొంతకాలం నుంచి కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మహిళా క్రికెట్కు మరింత ఆదరణ పెరిగేందుకు ఐపీఎల్ మాదిరిగానే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ నిర్వహించడానికి కూడా సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఈఏడాది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా మొదటి సీజన్ జరగబోతుంది. ఇక ఇందుకు సంబంధించిన అన్ని సన్నాహాలు కూడా జరుగుతూ ఉన్నాయి అని చెప్పాలి.

కాగా ఇప్పటికే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కు సంబంధించి మెగా వేలం ప్రక్రియ కూడా ముంబై వేదికగా జరిగింది. ఈ క్రమంలోనే పురుష ఆటగాళ్ళకు ఎక్కడ తక్కువ కాదు అనే రీతిలో మహిళా క్రికెటర్లను కూడా ఆయా ఫ్రాంచైజీలు  కోట్ల రూపాయలు వెచ్చించి.. కొనుగోలు చేయడం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఇకపోతే ఇప్పుడు తమ జట్టులో ఉండే ప్లేయర్లు ఎవరు అన్నదానిపై క్లారిటీ రావడంతో ఇక జట్టు కెప్టెన్, వైస్ కెప్టెన్ ఎవరైతే బాగుంటుంది అనే విషయంపై నిర్ణయం తీసుకునేందుకు ఆయా ఫ్రాంచైజీలు  బిజీగా మారిపోయాయి.

 ఇకపోతే ప్రస్తుతం భారత మహిళల జట్టుకు కెప్టెన్ గా ఉన్న హర్మన్ ప్రీత్ కౌర్ అటు ముంబై ఇండియన్స్ జట్టు తరఫున ఎంపికైంది. కెప్టెన్గా కూడా అవకాశం దక్కించుకుంది. ఈ క్రమంలోనే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లోనే ముంబై ఇండియన్స్ జట్టుకు సంబంధించిన జెర్సీ ఫోటో ప్రస్తుతం అధికారికంగా విడుదలైంది అని చెప్పాలి. ఇది సూపర్ హీరోలు ధరించేది.. ఇక్కడ సూర్యుడు.. సముద్రం.. నీలం అండ్ గోల్డ్ ఆఫ్ ముంబై ఉంటుంది. ఇదిగో మా మొట్టమొదటి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ జెర్సీ అంటూ ఇక ఆ ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో ఒక ఫోటో పెట్టగా.. ఇది చూసి అభిమానులు అందరూ కూడా మురిసిపోతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: