నన్ను ఒక ఫెయిల్యూర్ కెప్టెన్ ను చేశారు : కోహ్లీ

praveen
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంత అత్యుత్తమమైన ఆటగాడు అన్నది ఎవరో చెప్పడం కాదు ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో అతను సాధించిన రికార్డులు చెప్పకనే చెబుతూ ఉంటాయ్ అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎప్పుడు అద్భుతమైన ఆట తీరుతో టీమిండియాకు విజయాన్ని అందిస్తూ ఉంటాడు విరాట్ కోహ్లీ. ఇక కోహ్లీ లేని టీమిండియా జట్టును అటు అభిమానులు కూడా ఊహించుకోలేకపోతు ఉంటారు అని చెప్పాలి. టీమిండియా ఆడుతున్న మ్యాచ్ క్రికెట్ ప్రేక్షకులు చూస్తున్నారు అంటే అందుకు కోహ్లీకి ఉన్న పాపులారిటీనే కారణమని ఎన్నోసార్లు కోహ్లీ లేని మ్యాచ్లకు వచ్చిన రేటింగ్స్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి అర్థమైంది.

 అంతేకాదు టీమిండియాని చూసి అటు ప్రత్యర్థులు భయపడుతున్నారు అంటే ముందుగా వారికి టీమ్ ఇండియాలో కనిపించేది విరాట్ కోహ్లీ మాత్రమే అన్న విషయం కూడా అందరికి తెలుసు. అయితే ధోని తర్వాత విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ఈ క్రమంలోనే టెస్ట్ ఫార్మాట్లో టీమ్ ఇండియాను నెంబర్ వన్ స్థానంలో నిలిపాడు. ఇక ద్వైపాక్షిక సిరీస్ లో టీమ్ ఇండియాకు తిరుగులేని విజయాలను అందించాడు అని చెప్పాలి. అయితే ద్వైపాక్షిక సిరీస్లలో సక్సెస్ అయినప్పటికీ అటు ఐసిసి టోర్నీలలో మాత్రం కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా విఫలం అవుతూ వచ్చింది. ఒక్కసారి కూడా వరల్డ్ కప్ టైటిల్ గెలవలేదు అని చెప్పాలి. దీంతో ఎన్ని విజయాలు సాధించిన ఐసీసీ టైటిల్ గెలవకపోవడంతో కోహ్లీ ఒక ఫెయిల్యూర్ కెప్టెన్ అన్నట్లుగా ముద్ర వేసి చివరికి అతను కెప్టెన్సీ నుంచి తప్పుకునే పరిస్థితిని తీసుకువచ్చారు క్రికెట్ ప్రేక్షకులు.

 ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై స్వయంగా విరాట్ కోహ్లీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. తనపై కొంతమంది విశ్లేషకులు అభిమానులు ఫెయిల్యూర్ కెప్టెన్ అనే ముద్ర వేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రతి ఒక్కరు కూడా గెలవడం కోసమే టోర్నీలు ఆడతారు. 2017 ఛాంపియన్ ట్రోఫీ, 2019 వరల్డ్ కప్, 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, టి20 వరల్డ్ కప్ లో జట్టు ని సెమీ ఫైనల్ వరకు తీసుకెళ్లినప్పటికీ కూడా.. ట్రోఫీ గెలవకపోవడంతో నాపై ఫెయిల్యూర్ కెప్టెన్ గానే ముద్రవేశారు. కానీ అవన్నీ నేను పట్టించుకోలేదు అంటూ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: