కాస్లీ విల్లా కొన్న కోహ్లీ.. ధర ఎంతో తెలిస్తే షాకే?

praveen
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచ క్రికెట్లో తానేంటో నిరూపించుకొని ఇక అందరితో పోల్చి చూస్తే అగ్రస్థానంలో కొనసాగుతూ ఉన్నాడు విరాట్ కోహ్లీ. రికార్డుల విషయంలోనే కాదు ఇక అటు సోషల్ మీడియాలో పాపులారిటీ విషయంలో కూడా ఏ ఇతర ఆటగాడు విరాట్ కోహ్లీకి దగ్గరలో లేడు అని చెప్పాలి. ఆ రేంజ్ లో క్రేజ్ సంపాదించి ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో హవా నడిపిస్తూ ఉన్నాడు. ఇక తన ఆట తీరుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు కోహ్లీ. దీంతో ఇక విరాట్ కోహ్లీ ఎక్కడ మ్యాచ్ ఆడినా కూడా అక్కడ అభిమానులు కోహ్లీ ఆటను చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు.

 అయితే ఇక ప్రస్తుతం వాణిజ్య ప్రకటనల్లో కూడా మిగతా క్రికెటర్లతో పోల్చి చూస్తే టాప్ లో ఉండి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇక సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ద్వారా కూడా కోట్ల రూపాయలు సంపాదన వెనకేసుకుంటున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇంత పాపులారిటీ ఉన్న తర్వాత కోహ్లీ గురించి ఏదైనా విషయం బయటకు వస్తే అది హాట్ టాపిక్ గా మారిపోకుండా ఎలా ఉంటుంది. ఇప్పుడు విరాట్ కోహ్లీ కి సంబంధించిన ఒక వార్త కాస్త సోషల్ మీడియాను ఊపేస్తుంది అని చెప్పాలి. విరాట్ కోహ్లీ ఇటీవల ఒక లగ్జరీ విల్లాను కొన్నాడు అన్నది తెలుస్తుంది.

 అలీ బాగ్ లో ఇలా లగ్జరీ విల్లాను కొనుగోలు చేశాడట టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఆవాస్ లివింగ్ ప్రాజెక్ట్ బంగ్లాలో 2000 చదరపు అడుగులు ఉంటుందట ఈ విల్లా. అయితే ధర దాదాపు 6 కోట్ల రూపాయలు అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే కోహ్లీ ఇంత కాస్లి విల్లా కొన్నాడు అన్న విషయం తెలిసి అభిమానులందరూ షాక్ అవుతున్నారు అని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ తో బిజీ బిజీగా ఉన్నాడు అని చెప్పాలి. అయితే కోహ్లీ బిజీగా ఉన్న నేపద్యంలో అతడి సోదరుడు వికాస్ కోహ్లీ ఆలీబాగ్ లోని రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశాడట. ఇక ఈ విల్లాలో 400 చదరపు అడుగుల స్విమ్మింగ్ పూల్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: