వైరల్ : షేఫాలి వర్మను ఇంత కోపంగా ఎప్పుడు చూసుండరు?

praveen
క్రికెట్ అంటే కేవలం బంతి బ్యాట్ మధ్య జరిగే  ఆసక్తికరమైన పోరు మాత్రమే అని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే మైదానంలోకి బలిలోకి దిగిన తర్వాత కేవలం బంతి బ్యాట్ మధ్య మాత్రమే కాదు. ఎన్నో భావోద్వేగాల మధ్య కూడా పోరాటం జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. అన్ని ఎమోషన్స్ లోపల దాచుకొని ఇక జట్టును గెలిపించే అందుకోసం తీవ్రంగా శ్రమించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే కొన్ని కొన్ని సార్లు ప్లేయర్లు తమ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేక కాస్త అగ్ర సివ్ గా రియాక్ట్ అవ్వడం లాంటిది కూడా జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి.

 ఇక ఇలాంటిదే ఏదైనా జరిగింది అంటే.. ఇక అందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్గా మారిపోతూ ఉంటుంది. ఇకపోతే ఇటీవల సౌతాఫ్రికా వేదిక జరుగుతున్న మహిళల టి20 వరల్డ్ కప్ లో భాగంగా సెమీఫైనల్ లో ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య పోరు జరిగింది అని చెప్పాలి. చివరి వరకు కూడా నువ్వా నేనా అన్నట్లుగా సాగింది 5 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఫైనల్ లో విజయం సాధించింది. ఇక ఈ విజయంతో నేరుగా ఫైనల్లో అడుగుపెట్టింది అని చెప్పాలి. అయితే చివరి వరకు విజయం కోసం పోరాడిన టీమిండియా జట్టు ఓడిపోయిన ప్రేక్షకుల మనసు గెలుచుకుంది అని చెప్పాలి.

 అయితే ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో భారత బౌలర్ షెఫాలీ వర్మ తన సహనాన్ని కోల్పోయింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 10వ ఓవర్ వేసిన రాధా యాదవ్ బౌలింగ్లో 32 పరుగులు వ్యక్తిగత స్కోర్ వద్ద బెత్ ముని ఇచ్చిన ఈజీ క్యాచ్ ను షేఫాలి వర్మ జాడ విరిచింది. ఇక తర్వాత 12వ ఓవర్లో షికా పాండే బౌలింగ్లో బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా బెత్ మూని ఒక షాట్ ఆడింది. అక్కడ ఫీల్డింగ్  చేస్తున్న షేఫాలి ఎటువంటి పొరపాటు చేయకుండా క్యాచ్ అందుకుంది. ఈ క్రమంలోనే షేఫాలి వర్మ ఒక్కసారిగా అగ్రేసివ్ గా రియాక్ట్ అయ్యింది. గట్టిగా అరుస్తూ సెలబ్రేషన్స్ జరుపుకుంది. బెత్ ముని వైపు వేలు చూపిస్తూ వెళ్ళిపో అంటూ గట్టిగా అరిచింది. ఆమె  సెలబ్రేషన్స్ చూసి సహచరులు సైతం షాక్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: