అండర్సన్ అరుదైన రికార్డ్.. ఇప్పట్లో ఎవరికి సాధ్యం కాలేమో?

praveen
సాధారణంగా క్రికెట్లో ఫాస్ట్ బౌలర్లకు కెరియర్ కాలం చాలా తక్కువగా ఉంటుంది అని క్రికెట్ పందితులు చెబుతూ ఉంటారు . ఎందుకంటే ఫాస్ట్ బౌలర్లుగా కొనసాగుతున్న వారిని తరచూ గాయాల వీడుతా వేధిస్తూ ఉంటుందని అంటూ ఉంటారు.  అయితే ఇక ఇలా గాయాల నుంచి కోలుకొని.. యువ ఆటగాళ్ల పోటీని తట్టుకొని మళ్లీ అంతర్జాతీయ జట్టులోకి రావడం అనేది కొంతమందికి అసాధ్యమైన పని అని అంటూ ఉంటారు.

 ఈ క్రమంలోనే ఎంతోమంది ఫాస్ట్ బౌలర్లు 35 నుంచి 40 ఏళ్లలోపే తమ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సందర్భాలు చాలానే ఉన్నాయి అని చెప్పాలి.. అయితే ఇక్కడ ఒక ఫాస్ట్ బౌలర్ మాత్రం 40 ఏళ్లు దాటిపోతున్న ఇంకా తనలో సత్తువ ఉంది అన్న విషయాన్ని ప్రతి మ్యాచ్లో నిరూపిస్తున్నారు. తన అనుభవాన్ని అంతా కూడగట్టుకుని ప్రత్యర్ధులకు ముచ్చెమటలు పట్టిస్తూ ఉన్నాడు. అతను ఎవరో కాదు ఇంగ్లాండ్ సీనియర్ బౌలర్ జేమ్స్ అండర్సన్. ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవలే ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ బౌలర్ గా అవతరించాడు.

 ఇలా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని చేరుకోవడం జేమ్స్ అండర్సన్ కి ఆరోసారి కావడం గమనార్హం. అదే సమయంలో 87 ఏళ్ల రికార్డును కూడా బద్దలు కొట్టాడు. అత్యధిక వయసులో టెస్ట్ నెంబర్ వన్ బౌలర్గా అవతరించిన క్రికెటర్ గా నిలిచాడు. ప్రస్తుతం జేమ్స్ అండర్సన్ వయసు 40 ఏళ్ళ 27 రోజులు కావడం గణనార్హం. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగజం క్లారి గ్రీమెట్ పేరిట ఉండేది 1936 లో 40 ఏళ్ల రెండు నెలల వయస్సులో ఆయన ఈ ఘనత సాధించాడు. అయితే ప్రస్తుతం క్రికెట్లో చూసుకుంటే యువ ఆటగాళ్లు ఎవరైనా సరే 40 ఏళ్ళ వరకు మంచి ఫామ్ కనబరుస్తూ అంతర్జాతీయ జట్టులో కొనసాగడం కష్టమే. దీంతో ఇప్పటికైతే అండర్సన్ రికార్డును ఎసరు పెట్టే వాళ్ళు లేరు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: