గిల్ కాదు.. అతనే ఫ్యూచర్ స్టార్ : స్మిత్

praveen
ప్రస్తుతం టీమిండియా జట్టులో యువ సూపర్ స్టార్ గా కొనసాగుతూ ఉన్నాడు శుభమన్ గిల్ ఫార్మాట్ తో సంబంధం లేకుండా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే మొన్నటి వరకు కేవలం వన్డే, టెస్ట్ ఫార్మాట్ లో మాత్రమే అవకాశాలు దక్కించుకున్న యువ సంచలనం.. ఇక టి20 ఫార్మాట్లో కూడా ఇప్పుడు వరుసగా అవకాశాలు దక్కించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే సెంచరీలు డబుల్ సెంచరీలు బాదుతూ.. పాతికేళ్ల వయస్సు కూడా దాటకముందే ఇంకెన్నో ప్రపంచ రికార్డులు కూడా కొల్లగొడుతున్నాడు అని చెప్పాలి.

 టీమిండియాకు భవిష్యత్తు స్టార్ ఎవరో కాదు తానే అన్న విషయాన్ని తన ఆట తీరుతో ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా నిరూపిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. కాగా శుభమన్ గిల్ అసాధారణమైన ఆట తీరుపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారూ. రానున్న రోజుల్లో అతను ప్రపంచ క్రికెట్ను శాసించడం ఖాయమని ఎంతో మంది అభిప్రాయపడుతూ ఉన్నారు అని చెప్పాలి. ఇకపోతే భారత జట్టు ఆస్ట్రేలియాతో జరగబోయే మూడో టెస్ట్ మ్యాచ్లో శుభమన్ గిల్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. కేఎల్ రాహుల్ స్థానంలో అతను అవకాశం రానున్నట్లు తెలుస్తుంది. దీంతో భీకరమైన ఫామ్ లో ఉన్న శుభమన్ గిల్ ఎలా రాణిస్తాడు అనే విషయంపై చర్చ జరుగుతుంది.

 ఈ క్రమంలోనే శుభమన్ గిల్ గురించి ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్  షాకింగ్ కామెంట్స్ చేశాడు.  టీమిండియా యువ సంచులనం శుభమన్ గిల్ భవిష్యత్తు సూపర్ స్టార్ అని పలువురు క్రికెట్ నిపుణులు అభిప్రాయపడగా స్టీవ్ స్మిత్ మాత్రం వీరితో విభేదించాడు. ఇటీవల ఒక క్రీడా ఛానల్ ఇంటర్వ్యూలో భవిష్యత్తు సూపర్ స్టార్ ఎవరు అని అనుకుంటున్నారు అంటూ ఒక ప్రశ్న తలెత్తింది. అయితే పలువురు క్రికెట్ నిపుణులు శుభమన్ గిల్ పేరు చెప్పగా.. ఇక వీరితో విభేదించిన స్మిత్ ఇంగ్లాండ్ ప్లేయర్ హరిబ్రూక్స్ పేరు చెప్పాడు.  అయితే కేవలం టెస్టుల్లో మాత్రమే రాణిస్తున్న బ్రూక్స్ మూడు ఫార్మాట్లలో అదరగొడుతున్న గిల్ పోలిస్తే ఎందులో గొప్ప అని భారత అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: