వైస్ కెప్టెన్సీ మాత్రమే కాదు.. కేఎల్ రాహుల్ కు మరో షాక్?

praveen
గత కొన్ని రోజుల నుంచి భారత జట్టులో సీనియర్ బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్న కేఎల్ రాహుల్  వరుసగా విఫలం అవుతూనే వస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే అతనికి బీసీసీఐ ఎన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ ఎక్కడ నిరూపించుకోలేకపోతున్నారు. ఒకవైపు యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్న వేళ అటు కేఎల్ రాహుల్ మాత్రం పరుగులు రాపట్టడానికి ఎంతగానో ఇబ్బంది పడిపోతున్నాడు అని చెప్పాలి. అయినప్పటికీ ఇక జట్టుకు వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్న అతన్ని తుది జట్టులోకి తీసుకుంటూ వచ్చింది. అయితే ప్రస్తుతం భీకరమైన ఫామ్ లో ఉన్న శుభమన్ గిల్ లాంటి ఆటగాళ్లను బెంచ్ పై కూర్చోబెట్టి కేఎల్ రాహుల్ ని జట్టులోకి తీసుకోవడం ఎంతవరకు సమంజసం అనే విషయంపై ఎంతోమంది ప్రేక్షకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 ఈ క్రమంలోనే వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్న కేఎల్ రాహుల్ పై వేటు వేసేందుకు బీసీసీఐ సిద్ధమైంది అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా మధ్య జరగబోయే వన్డే సిరీస్ కోసం జట్టును ప్రకటించగా ఇక వైస్ కెప్టెన్ గా అటు కేఎల్ రాహుల్ ను తొలగించింది. కొత్త వైస్ కెప్టెన్గా  పాండ్యాకు బాధ్యతలు అప్పగించింది. అదే సమయంలో ఇక రెండు టెస్టులకు వైస్ కెప్టెన్ గా ఉన్న కే ఎల్ రాకుండా మిగతా రెండు టెస్ట్ లకు కూడా ఆ బాధ్యతల నుంచి తొలగించి రవీంద్ర జడేజా కు వైస్ కెప్టెన్సీ అప్పగించింది అని చెప్పాలి.

 అయితే ముందుగా వైస్ కెప్టెన్ నుంచి తొలగించి కేఎల్ రాహుల్ కు షాక్ ఇచ్చిన బీసీసీఐ ఇక ఇప్పుడు అతన్ని జట్టు నుంచి పక్కన పెట్టేందుకు సిద్ధమవుతుంది అనేది తెలుస్తుంది. అతని స్థానంలో ప్రస్తుతం భీకరమైన ఫామ్ లో ఉన్న గిల్ కు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందట  అయితే ఇక మిగిలిన రెండు టెస్టులకు సంబంధించి జట్టు ప్రకటనలో ఒక జయదేవ్ జట్టులోకి రావడం మిగతా ఎలాంటి మార్పులు లేవు. రెండు మ్యాచ్లలో టీమిండియా గెలిచిన నేపథ్యంలో ఎలాంటి మార్పులు లేకుండానే అటు మరోసారి అదే టీం బరిలోకి దిగిపోతుంది. అయితే తుది జట్టులో మాత్రం రాహుల్కు బదులు గిల్ కనిపించబోతున్నాడు అనేది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: