అసలేం జరుగుతుంది.. వార్నర్ ఇంటికి.. మాక్స్ వెల్ జట్టులోకి?

praveen
ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడేందుకు భారత పర్యటనకు వచ్చింది అన్న విషయం తెలిసిందే  ఈ క్రమంలోనే వరుసగా టెస్ట్ మ్యాచ్ లు ఆడుతూ బిజీగా ఉంది ఆస్ట్రేలియా జట్టు. ఇక ఇప్పటికే భారత్ ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ మ్యాచ్లు జరిగాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండు టెస్ట్ లలో కూడా అటు ఆతిధ్య భారత జట్టు ఘన విజయాన్ని సాధించింది. ఈ క్రమంలోనే సిరీస్ లో భాగంగా 2-0 తేడాతో ఆదిక్యాన్ని సంపాదించింది అని చెప్పాలి.

 అయితే ఇప్పటికే ఇలా వరుస ఓటములతో సతమతమవుతుంది ఆస్ట్రేలియా జట్టు. ఇలాంటి సమయంలో ఇక ఆస్ట్రేలియా జట్టులో ఏం జరుగుతుందో కూడా తెలియక అభిమానులు అందరూ కన్ఫ్యూషన్లో మునిగిపోతున్నారు. ఎందుకంటే జట్టులో కీలక ఆటగాళ్లుగా కొనసాగుతున్నవారు. వరుసగా గాయాల బారిన పడుతూ జట్టు దూరమవుతున్నారు అని చెప్పాలి. ఇప్పటికే కాలి మడమ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో పేసర్ జోస్ హెజిల్ వుడ్ సిరీస్ మొత్తం దూరమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే రెండు టెస్టులకు స్టార్క్, గ్రీన్ దూరమయ్యారు. అదే సమయంలో ఇటీవల కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్ సైతం ఇక వ్యక్తిగత కారణాల నేపథ్యంలో స్వదేశానికి పయనం అవుతున్నాడు.

 అయితే మూడో టెస్ట్ సమయానికి తొమ్మిది రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ఇక కమిన్స్ మళ్లీ తిరిగి వస్తాడని చెబుతున్నప్పటికీ ఆ విషయంలో కూడా అనుమానం నెలకొంది. అయితే ఇక ఇప్పుడు మరో స్టార్ ప్లేయర్ ఆస్ట్రేలియా జట్టుకు దూరమయ్యాడు. వార్నర్ కు తగిలిన గాయం తీవ్రమైందని ఇక అతని ఎల్బో ఫ్రాక్చర్ అయింది అన్నది తెలుస్తుంది. దీంతో ఇక తదుపరి మ్యాచ్ లకు అందుబాటులో ఉండడం కష్టమే అని చెప్పాలి.. అయితే వార్నర్ స్థానంలో మ్యాక్స్ వెల్  జట్టులోకి తీసుకుంటారు అన్నది తెలుస్తుంది. ఏదేమైనా గత కొన్ని రోజుల నుంచి అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటూ ఉండడంతో అభిమానులు కన్ఫ్యూషన్ లో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: