షాకింగ్ : ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైనప్పుడల్లా ఒక విషయం మాత్రం ప్రతి ఏడాది చర్చకు వస్తూనే ఉంది. అదే మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ గురించి. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన మహేంద్రసింగ్ ధోని  ఐపీఎల్లో మాత్రమే ఆడుతూ ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా కొనసాగుతూ ఉన్నాడు. అయితే గత ఏడాది జడేజాకు  కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన ధోనీకి గత ఏడాది సీజన్ చివరిది అనుకున్నారు. కానీ జడేజా కెప్టెన్సీ చేపట్టలేక మళ్ళీ ధోనికే అప్పగించేసాడు.

 దీంతో ఇన్నాళ్లపాటు ఎంతో విజయవంతంగా ముందుకు నడిపించిన సీఎస్కే జట్టుకు ఇక ఇప్పుడు ఒక మంచి కెప్టెన్ నియమించాల్సిన బాధ్యత ధోనిపై పడింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే రిటైర్మెంట్ ప్రకటించాలనే ఆలోచన ఉన్నప్పటికీ అతను ఇంకా జట్టుతోనే కొనసాగుతున్నాడని టాక్ కూడా ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ సీజన్ కోసం జరిగిన మినీ వేలంలో బెన్ స్టోక్స్  ని జట్టులోకి తీసుకుంది సీఎస్కే యాజమాన్యం. అతనికి కెప్టెన్సీ  అప్పగించే అవకాశం ఉంది అన్న ప్రచారం కూడా మొదలైంది అన్న విషయం తెలిసిందే. అయితే ఒకవేళ ధోని రిటైర్మెంట్ ప్రకటించిన తన హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ ఆడిన తర్వాతే అలాంటి ప్రకటన చేస్తాడని కూడా కొంతమంది క్రికెట్ నిపుణులు  అంచనా వేశారు.

 ఇకపోతే ఈ ఏడాది ఐపీఎల్ ను ఏకంగా 12 వేదికలపై నిర్వహించేందుకు బీసీఐ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ధోని హోమ్ గ్రౌండ్ లో కూడా మ్యాచ్ జరగబోతుంది. కాగా ఇక మహేందర్ సింగ్ ధోని ఈ సీజన్తో ఐపీఎల్ కు గుడ్ బై చెప్పబోతున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ సీఎస్కే టీం ప్లే ఆఫ్ కి చేరకపోతే.. ఇక మే 14వ తేదీన ధోని హోమ్ గ్రౌండ్ చెన్నైలో కోల్కతాతో జరిగే మ్యాచ్ చివరిది కానుంది అన్నది తెలుస్తుంది. అయితే ఇప్పుడు వరకు తన రిటైర్మెంట్ గురించి ఎలాంటి సమాచారం యాజమాన్యానికి చెప్పలేదని.. సిఎస్కే జట్టులోని ఒక అధికారి చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: