లేడీ ధోని.. సూపర్ క్యాచ్ పట్టిందిగా?

praveen
భారత క్రికెట్లో మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక సాదాసీదా  టికెట్ కలెక్టర్ స్థాయి నుంచి ఏకంగా దేశం గర్వించే క్రికెటర్ స్థాయికి ఎదిగాడు అని చెప్పాలి. అయితే ఇక ధోని బ్యాటింగ్ లోనే కాదు వికెట్ కీపింగ్ లో కూడా ఎంతో దిట్ట అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే నేటి రోజుల్లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇస్తున్న ఎంతోమంది ఇక ఇలా ధోనిని స్ఫూర్తిగా తీసుకుంటూ ఉంటారు. అయితే ధోని వికెట్ల వెనకాల కీపింగ్ చేస్తున్నాడు అంటే చాలు వేటకు వచ్చిన సింహం వేటాడటానికి సిద్ధంగా  నిలబడిందేమో అన్నట్లుగా కనిపిస్తూ ఉంటాడు.

 ఎందుకంటే కళ్ళు మూసి తెరిచేలోగానే మహేంద్రసింగ్ ధోని మెరుపు వేగంతో బ్యాట్స్మెన్ ని స్టంట్ అవుట్ చేసి ఇక పెవీలియన్ పంపించడం లాంటివి ఎన్నోసార్లు చూశాము అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో ధోనిని స్ఫూర్తిగా తీసుకొని అంతర్జాతీయ క్రికెట్ లోకి వస్తున్న ఎంతో మంది యువ క్రికెటర్లు అటు ధోని తరహాలోనే కీపింగ్ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాము. ఇక ఇప్పుడు లేడీ మహేంద్రసింగ్ ధోనీకి సంబంధించిన ఒక వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ప్రస్తుతం భారత మహిళల జట్టులో వికెట్ కీపర్ గా కొనసాగుతుంది రీఛాగోష్.

 ఇకపోతే ఇటీవలే ఒక స్టన్నింగ్ క్యాచ్ పట్టింది. అచ్చం మహేంద్ర సింగ్ ధోని తరహాలోనే రిచాగోష్ క్యాచ్ అందుకోవడం గమనార్హం. దీంతో ఇక ఇది చూసిన క్రికెట్ ప్రియులందరూ కూడా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఇటీవల ఇంగ్లాండు, ఇండియా మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్లో ఇండియా జట్టు 11 పరుగుల తేడాతో ఓడిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో  కీపింగ్ చేస్తున్న రీఛాగోష్ కుడివైపు డైవ్ చేసి ధోని తరహాలోనే ఒక క్యాచ్ పట్టుకుంది. ఇది చూసి టికెట్ ప్రియులందరూ కూడా ధోనిని గుర్తు చేశావు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: