మ్యాచ్ ఓడినా.. రేణుక సింగ్ ప్రేక్షకుల మనసు గెలిచింది?

praveen
ఇటీవల కాలంలో భారత మహిళా క్రికెటర్లు అద్భుతంగా రాణిస్తున్న తీరు ప్రపంచ క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే. ప్రతి మ్యాచ్ లో కూడా పురుష క్రికెటర్ల లాగా కాదు అంతకుమించి అనే రేంజ్ ప్రదర్శన చేస్తూ ప్రేక్షకులందరినీ కూడా ఫిదా చేసేస్తున్నారు. అత్యుత్తమ గణాంకాలను నమోదు చేస్తూ ఎన్నో రికార్డులను కూడా కొల్లగొడుతున్నారు అని చెప్పాలి. కాగా ప్రస్తుతం టీమిండియా జట్టు సౌత్ఆఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్ లో బిజీ బిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. అక్కడ వరుసగా మ్యాచ్లు ఆడుతూ అదరగొడుతూ ఉంది టీమ్ ఇండియా జట్టు.

 ఇక టి20 వరల్డ్ కప్ లో భాగంగా వరుస విజయాలతో సూపర్ సక్సెస్ అవుతుంది అనే విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి  అయిన పాకిస్తాన్ తో ఢీ కొట్టిన టీమిండియా మహిళలు జట్టు చిరకాల ప్రత్యర్థిని చిత్తు చేసేసింది. ఇక తర్వాత వెస్టిండీస్ తో మ్యాచ్ జరగగా.. ఈ మ్యాచ్ లో కూడా ఘనవిజయాన్ని సాధించింది టీమ్ ఇండియా జట్టు. ఇకఇటీవల పటిష్టమైన ఇంగ్లాండు తో మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఇక ఇంగ్లాండ్ ఆధిపత్యాన్ని సాధించి 11 పరుగుల తేడాతో టీమ్ ఇండియాని ఓడించింది.

 అయితే ఇలా ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్ లో టీమ్ ఇండియా ఓడిపోయినప్పటికీ అటు భారత బౌలర్ రేణుక సింగ్ మాత్రం అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. తన ప్రదర్శనతో ప్రేక్షకుల మది దోచేసింది అని చెప్పాలి. ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో మొత్తంగా నాలుగు ఓవర్లు వేసిన రేణుక సింగ్ 15 పరుగులు మాత్రమే ఇచ్చింది. అంతేకాకుండా కీలకమైన ఐదు వికెట్లు పడగొట్టింది. దీంతో టి20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన భారత ప్లేయర్గా అరుదైన రికార్డు ఖాతాలో వేసుకుంది రేణుకా సింగ్
 గతంలో పాకిస్తాన్ పై ప్రియాంక రాయి 3.5 ఓవర్లు వేసి 16 పరుగులు ఇచ్చే 5 వికెట్స్ తీసిన రికార్డు అత్యుత్తమంగా ఉండగా ఇక ఇప్పుడు రేణుక సింగ్ ఆ రికార్డును బద్దలు కొట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: