ఓరి నాయనో.. ఇది టెస్ట్ క్రికెటా.. లేక వన్డే క్రికెటా?

praveen
సాంప్రదాయమైన క్రికెట్ గా పేరు ఉన్న టెస్ట్ ఫార్మాట్లో బ్యాట్స్మెన్లు ఎంత ఆచితూచి బ్యాటింగ్ చేస్తూ ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పటి వరకు టి20 వన్డే ఫార్మాట్లలో బ్యాటింగ్ విధ్వంసాన్ని కొనసాగించి తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్లు అటు టేస్టు ఫార్మాట్లో బరిలోకి దిగితే మాత్రం ఎక్కువ బంతులను వృధా చేస్తూ తక్కువ పరుగులు చేస్తూ వికెట్ని కాపాడుకుంటూ ఉంటారు. ఇక ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్ చరిత్రలో అందరూ ఆటగాళ్లు కూడా ఇలాంటి ఆట తీరుతోనే జట్టును గెలిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో టెస్ట్ ఫార్మాట్ కి ఆదరణ తగ్గిపోతున్న నేపథ్యంలో ఇక పూర్వ వైభవాన్ని తీసుకురావడమే లక్ష్యంగా ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్లో కొత్త విధానాన్ని ఫాలో అవ్వడం మొదలు పెట్టింది.

 రెగ్యులర్ ఆటతీరులో కాకుండా పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆడినట్లుగా ఎంతో దూకుడుగా ఆడి ఇక ప్రత్యర్థులపై పైచేయి సాధించడమే లక్ష్యంగా ప్రస్తుతం ప్రతి మ్యాచ్ లో కూడా అదరగొడుతుంది. కాగా ఇంగ్లాండ్ ప్రస్తుతం బజ్ బాల్ అనే విధానాన్ని అవలంబిస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే సరికొత్త శైలి బ్యాటింగ్ ద్వారా భారీ టార్గెట్లను సైతం అలవోకగా చేదిస్తోంది. ఇక ఇటీవల న్యూజి ల్యాండ్ తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో కూడా ఇంగ్లాండ్ బజ్ బాల్ అమలు చేసింది అని చెప్పాలి. ఈ మ్యాచ్లో భాగంగా టాస్ ఓడిపోయిన ఇంగ్లాండు జట్టు మొదట బ్యాటింగ్ చేసింది.

 ఈ క్రమంలోనే వన్డే క్రికెట్ తరహాలోనే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు అందరూ రెచ్చిపోయారు. 58.2 ఓవర్లలోనే 9 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది ఇంగ్లాండు జట్టు. ఈ క్రమంలోనే కెప్టెన్ బెన్ స్టోక్స్ అప్పటికే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇలా వన్డే క్రికెట్ తరహాలో బ్యాటింగ్ చేసి ఒక్కరోజులోనే భారీ స్కోరు సాధించింది ఇంగ్లాండ్. అయితే ఒక వికెట్ మిగిలి ఉన్న సమయంలో మరిన్ని పరుగులు చేసేందుకు అవకాశం ఉన్న ఇంగ్లాండ్ మాత్రం తమ బౌలింగ్ విభాగం పై ఉన్న నమ్మకంతో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేయడం గమనార్హం. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లలో డకెట్ 84 హరి బ్రూక్స్  89 పరుగులతో రాణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: