ఖేల్ ఖతం: వరల్డ్ కప్ సెమీస్ రేస్ నుండి ఆ జట్లు అవుట్ ?

VAMSI
గత వారం రోజులుగా దక్షిణాఫ్రికా వేదికగా పది జట్ల మధ్యన మహిళల టీ 20 వరల్డ్ కప్ జరుగుతోంది. కాగా ఈ వరల్డ్ కప్ లో టైటిల్ ను కొట్టగల సామర్ధ్యం ఉన్న జట్లుగా ఆస్ట్రేలియా , ఇంగ్లాండ్ , ఇండియా మరియు సౌత్ ఆఫ్రికాలు ఫేవరెట్ లుగా ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు జరిగిన ప్రదర్శన బట్టి చూస్తే శ్రీలంక జట్టు కూడా సెమీస్ చేరే అవకాశాలు కొట్టిపారేయలేము. ఆస్ట్రేలియా తాను ఆడిన రెండు మ్యాచ్ లలోనూ విజయం సాధించి దాదాపుగా సెమీస్ కు దగ్గరగా ఉంది. శ్రీలంక సైతం ఆడిన రెండు మ్యాచ్ లలోనూ గెలిచి మరో మ్యాచ్ గెలిస్తే సెమీస్ చేరడం పక్కా. ఇక శ్రీలంక మొదటి మ్యాచ్ లో ఆతిధ్య సౌత్ ఆఫ్రికాను ఓడించడం సంచలనం అని చెప్పాలి.
మరో గ్రూప్ లో ఇండియా మరియు ఇంగ్లాండ్ లు కూడా చెరో రెండు మ్యాచ్ లు గెలిచి దాదాపుగా సెమీస్ చేరినట్లే. గ్రూప్ ఏ నుండి న్యూజిలాండ్ మరియు బంగ్లాదేశ్ లు సెమీస్ కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్ లను భారీ తేడాతో గెలవాల్సి ఉంది. దానితో దాదాపుగా ఈ రెండు జట్లు సెమీస్ రేస్ నుండి తప్పుకున్నట్లే. గ్రూప్ ఏ లో మరో సెమీస్ స్థానం కోసం శ్రీలంక మరియు సౌత్ ఆఫ్రికా ల మధ్యన పోటీ ఉండనుంది. ఇక గ్రూప్ బి లో ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్ లలోనూ ఓడిన ఐర్లాండ్ మరియు వెస్ట్ ఇండీస్ లు సెమీస్ రేస్ నుండి అనధికారికంగా తప్పుకున్నట్లే. పాకిస్తాన్ కు చాలా తక్కువ ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి.
అయితే క్రికెట్ లో ఎప్పుడు ఏమి జరుగుతుంది అన్నది ఊహించడం కష్టం. దీనిని బట్టి చూస్తే గ్రూప్ బి నుండి ఇండియా మరియు ఇంగ్లాండ్ లు గ్రూప్ ఏ నుండి ఆస్ట్రేలియా.. మరొక జట్టు తేలాల్సి ఉంది . మరి చూద్దాం చివరగా సెమీస్ కు ఏ నాలుగు జట్లు అర్హత సాధిస్తాయో ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: