బ్రియాన్ లారాకు కీలక బాధ్యతలు.. పూర్వ వైభవం వస్తుందా?

praveen
వెస్టిండీస్ జట్టు అనగానే ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా విద్వంసకర ఆటగాళ్లే గుర్తుకు వస్తూ ఉంటారు అని చెప్పాలి. ఎందుకంటే వెస్టిండీస్ జట్టు తరుపున ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లు అటు ప్రపంచ క్రికెట్ లో తమ ఆట తీరుతో ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు. అంతేకాదు ఇక ప్రత్యర్ధులను భయపెట్టే టీం గా కూడా వెస్టిండీస్ అటు ప్రపంచ క్రికెట్లో హవా నడిపించింది అని చెప్పాలి. ఎంతోమంది దిగ్గజ ప్లేయర్లు వెస్టిండీస్ తరఫున ప్రాతినిధ్యం వహించి ఇక ఎన్నో ప్రపంచ రికార్డులు కూడా కొల్లగొట్టారు. కానీ ఇక ఎంతోమంది సీనియర్ ప్లేయర్లు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇక యువ ఆటగాళ్లు మాత్రం అదే చరిష్మాను కొనసాగించలేకపోయారు.

 అయితే ఒకప్పుడు వెస్టిండీస్ అంటే ప్రత్యర్ధులను వనికించే జట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం వెస్టిండీస్ అంటే ఒక పేలవమైన జట్టుగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఆ జట్టు ఎక్కడ ప్రత్యర్థులకు పోటీ ఇవ్వలేక వరుసగా ఓటములు చవిచూస్తూ ఇక ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా ఆశ్చర్యపరుస్తూ ఉంది. ఇలా వెస్టిండీస్ పూర్వ వైభవాన్ని కోల్పోయింది అని చెప్పాలి. ఇలాంటి సమయంలోనే ఇక ఇటీవల ఆ దేశ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. వెస్టిండీస్ క్రికెట్ దిగజంగా ఉన్న బ్రియాన్ లారాకు ఇక మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు కీలకమైన బాధ్యతలను అప్పగించింది అని చెప్పాలి.

 గత కొంతకాలం నుంచి వెస్టిండీస్ ప్రదర్శన చెప్పుకోదగ్గ రీతిలో లేకపోవడంతోనే ఇక ఆ దేశ క్రికెట్ బోర్డు ఇలాంటి నిర్ణయం తీసుకుంది అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే లెజెండరీ క్రికెటర్ బ్రియాన్ లారా వెస్టిండీస్ జట్టుకు పర్ఫామెన్స్ మెంటార్ గా విధులు నిర్వహించబోతున్నాడు. ఈ క్రమంలోనే జాతీయ జట్టు బోర్డు అకాడమీతో కలిసి లారా పని చేయబోతున్నాడు అని చెప్పాలి. అంతేకాదు ఆటగాళ్లకు సలహాలు ఇవ్వడం.. క్రికెట్ సెన్స్ నేర్పించడం కోచ్ లకి సహాయం చేయడం లాంటివి చేయబోతున్నాడు. ఇక అతని రాకతో పూర్వవైభవం వస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: