రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. అభిమానుల షాక్?

praveen
హాషిమ్ ఆమ్లా.. ఈ పేరు గురించి క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేస్తే అది అతిశయోక్తి అవుతుంది అని చెప్పాలి. ఎందుకంటే ఇక సౌత్ ఆఫ్రికా క్రికెట్ జట్టులోకి అరంగేట్రం చేసిన తర్వాత ఇక తక్కువ సమయంలోనే స్టార్ క్రికెటర్గా ఎదిగాడు హాషిమ్ ఆమ్లా. ఈ క్రమంలోనే తన అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనలతో ఇక సౌతాఫ్రికా జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు అని చెప్పాలి. అంతేకాదు ఇక జట్టు విజయం కోసం అద్భుతమైన పోరాటం సాగించి అత్యుత్తమ క్రికెటర్ గా కూడా పేరు సంపాదించుకున్నాడు హాషిమ్ ఆమ్లా.

 ఇక దాదాపు దశాబ్ద కాలం నుంచి అటు సౌత్ ఆఫ్రికా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే తన అద్భుతమైన బ్యాటింగ్ తో ఇప్పటికే సౌత్ ఆఫ్రికా జట్టుకు అద్భుతమైన విజయాలను అందించిన హాషిమ్ ఆమ్లా గత కొంతకాలం నుంచి మాత్రం ఇక జట్టులో సరైన స్థానం దక్కించుకోలేకపోతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇటీవలే హాషిమ్ ఆమ్లా షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. తన కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మట్ ల నుంచి కూడా తప్పుకుంటున్నాను అంటూ ప్రకటించాడు అని చెప్పాలి. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశాడు హాషిమ్ ఆమ్లా.

 ఇక పోతే ఇప్పుడు వరకు హాషిమ్ ఆమ్లా తన కెరీర్లు 181 వన్డే మ్యాచ్లు ఆడాడు. ఈ ఫార్మాట్లో 8113 పరుగులు చేశాడు అని చెప్పాలి. ఇక వీటిలో 27 సెంచరీలు 39 హాఫ్ సెంచరీలు ఉండడం గమనార్హం. 124 టెస్ట్ మ్యాచ్లు ఆడిన హాషిమ్ ఆమ్లా 9282 పరుగులు చేశాడు. వీటిలో 28 సెంచరీలు 41 సెంచరీలు ఉన్నాయ్. 44 టి20 మ్యాచ్లలో 1277 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించాడు అని చెప్పాలి. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కూడా తన ఆటతీరుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: