కోహ్లీకి డిమోషన్.. వన్ డౌన్ లో ఎవరంటే?

praveen
ఇప్పటికే భారత పర్యటనకు వచ్చిన శ్రీలంక జట్టుతో వన్డే సిరీస్ ఆడిన టీమిండియా జట్టు అదరగొట్టింది అన్న విషయం తెలిసిందే. ఎక్కడ శ్రీలంకకు అవకాశం ఇవ్వకుండా మూడు మ్యాచ్లలో కూడా విజయం సాధించి ఆధిపత్యాన్ని చెలాయించింది. ఇక ఇప్పుడు భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ జట్టుతో కూడా అదే రీతిలో పోరాడేందుకు సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే. కాగా నేటి నుంచి ఇక ఈ వన్డే సిరీస్ ప్రారంభం కాబోతోంది. మొదటి మ్యాచ్ హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరగబోతుంది అని చెప్పాలి.

 అయితే ఇక న్యూజిలాండ్తో జరగబోయే వన్డే సిరీస్ లో   టీమ్ ఇండియా ప్రయోగాలు చేయబోతుందా అంటే ప్రస్తుతం మాత్రం అవును అనే టాక్ వినిపిస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే తుది జట్టులో యువకులకు సమచిత స్థానం కల్పించాలని టీమ్ ఇండియా సెలెక్టర్లు భావిస్తున్నారట
ఈ క్రమంలోనే ఇక సీనియర్లు తమ స్థానాన్ని త్యాగం చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు అంటూ ఏకంగా సంజయ్ మంజ్రేకర్ తన మనసులో మాట బయటపెట్టాడు. ఇక ఇదే విషయాన్ని పలువురు విశ్లేషకులు కూడా ప్రస్తావిస్తున్నారని చెప్పాలి.

 త్వరలో భారత్ వేదికగా ప్రారంభం కాబోయే వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా బాగా రాణించాలి అంటే ఇక జట్టులో ఉన్న యువకులకు వీలైనన్ని అవకాశాలు కల్పించాలని.. ఇక ఇలాంటి సమయంలో సీనియర్లు తమ బ్యాటింగ్ స్థానాలను మార్చుకోక తప్పదు అంటూ అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు. గత కొంతకాలం నుంచి అటు టీమ్ ఇండియాలో ఓపెనింగ్స్ స్థానం కోసం తీవ్రమైన పోటీ నెలకొంది అన్న విషయం తెలిసిందే. మంచి ఫామ్ లో కొనసాగుతున్న శుభమన్ గిల్ ను ఓపెనర్ గా బరిలోకి దింపాల లేకపోతే డబుల్ సెంచరీ తో అదరగొట్టిన ఇషాన్ కిషన్ జట్టులోకి తీసుకోవాలా అనేదానిపై మేనేజ్మెంట్ సైతం తర్జనభర్జన పడుతుందట.

 ఇలాంటి పరిస్థితుల్లో ఇక న్యూజిలాండ్తో జరగబోయే వన్డే సిరీస్ లో భాగంగా రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఇషాన్ కిషోన్నే బరిలోకి దింపాలని మేనేజ్మెంట్ భావిస్తుందట.  రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ కావడంతో ఇక వీరి ఓపెనింగ్ జోడి వైపే ఎక్కువగా సెలక్టర్లు కూడా మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అదే సమయంలో మంచి ఫామ్ లో ఉన్న  ఆటగాడు గిల్ కు అన్యాయం జరగకుండా.. సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీని బ్యాటింగ్ ఆర్డర్లో వెనక్కి పంపి ఇక వన్ డౌన్ లో గిల్ కి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: