మమత బెనర్జీతో సౌరబ్ గంగూలీ భేటీ.. దేనికోసం?

praveen
గత కొంతకాలం నుంచి బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ తరచు వార్తల్లో నిలుస్తూ ఉన్నాడు అని చెప్పాలి. రెండోసారి బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరబ్ గంగూలీ కొనసాగుతాడని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో బీసీసీఐ పెద్దలు అతన్ని పదవి నుంచి తప్పించారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొత్త అధ్యక్షుడిగా మాజీ ఆటగాడు రోజర్ బిన్ని ఎంపికయ్యాడు. ఇక రోజర్ బిన్ని బాధ్యతలు చేపట్టిన తర్వాత సౌరబ్ గంగూలీ అధ్యక్షతన తీసుకున్న అన్ని నిర్ణయాలను కూడా మారుస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు అని చెప్పాలి.

 సౌరబ్ గంగూలీని అటు బీసీసీఐ అధ్యక్షుడిగా తొలగించిన సమయంలో ఒక ఆసక్తికర చర్చ తెరమీదికి వచ్చింది. అందరి క్రికెటర్ల లాగానే సౌరబ్ గంగూలీని కూడా బిజెపిలో చేరాలని బిజెపి పెద్దలు ఒత్తిడి చేశారని.. కానీ సౌరవ్ గంగూలీ మాత్రం అందుకు ఒప్పుకోలేదని. ఈ కారణం చేతే ఇక అతని రెండవసారి బీసీసీఐ  అధ్యక్షుడిగా చేయకుండా చివరికి పదవి కోల్పోయేలా చేశారని.. దీనికంతటి వెనక రాజకీయ కుట్ర ఉంది అంటూ ప్రచారం కూడా జరిగింది అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఇటీవల సౌరబ్ గంగూలీ గురించిన మరో వార్త హాట్ టాపిక్ గా మారిపోయింది.

 బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ ఇక ఇటీవల పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి మమత బెనర్జీని కలిశారు. కోల్కతాలోని నాబానాలో ఉన్న ఆమె కార్యాలయంలో ఆమెతో భేటీ అయ్యారు అని చెప్పాలి. 15 నిమిషాల పాటు వారు సమావేశమై మాట్లాడుకున్నారు. అయితే వారు ఏం మాట్లాడుకున్నారు.. ఇక ఈ సమావేశం దేనికి ఉద్దేశించి జరిగింది అన్నది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఇందుకు సంబంధించిన వివరాలు ఏవీ బయటకు రాకపోవడం గమనార్హం. అయితే మరికొన్ని రోజుల్లో సౌరబ్ గంగూలీ బిజెపిని కాదని అటు త్రుణమూల్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు అన్న ప్రచారం తెరమీదకి వచ్చింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: