'జారుమిఠాయి' పాటకు.. ఆమె ఎంత పారితోషికం తీసుకుందో తెలుసా?

praveen
ఇటీవల కాలంలో కొన్ని పాటలు సోషల్ మీడియాను తెగ ఊపేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అలాంటి వాటిలో జానపద గేయాల ఎక్కువగా ఉన్నాయి. ఇక ఇలా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించి సినీ సెలబ్రిటీల దగ్గర నుంచి కామన్ మ్యాన్ వరకు అందరూ రీల్స్ చేసేలా చేసిన పాట ఏదైనా ఉంది అంటే అది జారు మిఠాయి  పాట. మంచు విష్ణు హీరోగా నటించిన జిన్నా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో మోహన్ బాబు స్వయంగా తన ఊరు నుంచి ఒక మహిళను పిలిపించి స్టేజి మీద జారు మిఠాయి అనే పాటను పాడించారు.

 అదే పాటకు హంగులు జోడించి ఇక సినిమాలో కూడా పెట్టారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇలా సినిమాలో ఉన్న పాట పాపులారిటీ సాధించలేదు. కానీ ఏకంగా స్టేజి మీద ఒక పల్లెటూరి మహిళ పాడిన జారు మిఠాయి పాట మాత్రం ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జిన్న సినిమా థియేటర్లలోకి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. కానీ జారు మిఠాయి పాట మాత్రం ఇక జిన్నా సినిమా విడుదలై ఎన్నో రోజులు గడుస్తున్నా కూడా ఇంకా ప్రేక్షకుల నోళ్ళల్లో నానుతూనే ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 ఎన్నో చానల్స్ కూడా ఏకంగా జారు మిఠాయి పాట పాడిన భారతిని పిలిపించి ఇంటర్వ్యూలు చేయడం ఆమెతో మరోసారి అలాంటి పాట పాడించడం లాంటివి చేశాయి. ఈ క్రమంలోనే జారు మిఠాయి పాట గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది భారతి. ఏకంగా జిన్నా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ పాట పాడినందుకు మోహన్ బాబు తనకు 50 వేల రూపాయలు ఇచ్చినట్లు సంతోషాన్ని వ్యక్తం చేసింది భారతి.  అంతే కాదు జారు మిఠాయి పాటకు అర్ధాన్ని చెప్పుకొచ్చింది. జారు మిఠాయి అంటే ఒక అమ్మాయి పేరట. ఇక మొగ్గల కాలింగో అనే పదానికి అబ్బాయిలు ఎవరూ కూడా తన వైపుచూడట్లేదని అర్థం వస్తుందని భారతి చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: