ధోని శిష్యుడు విధ్వంసం.. కేవలం 28 బంతుల్లోనే ఊచకోత?

praveen
ప్రస్తుతం రంజీ ట్రోఫీలో భాగంగా ఎంతో మంది యువ ఆటగాళ్లు తమ ప్రతిభతో అదరగొడుతున్నారు అన్న విషయం తెలిసిందే. అదిరిపోయే ప్రదర్శన చేస్తూ సెంచరీలతో చెలరేగిపోతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా ఫ్యూచర్ స్టార్స్ తామే అన్న విషయాన్ని నిరూపిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో కొనసాగుతూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న రియాన్ పరాగ్ సైతం తన అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు అని చెప్పాలి. ఏకంగా టి20 స్టైల్ లో రంజీ ట్రోఫీలో విధ్వంసం సృష్టిస్తున్నాడు.

 ఇటీవల జరిగిన మ్యాచ్లో 278.57 స్ట్రైక్ రేట్ తో మరోసారి బౌలర్లను ఊచకోత కోశాడు అని చెప్పాలి. డిసెంబర్ 27న మొదలైన టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో రియాన్ పరాగ్ బ్యాటింగ్ వచ్చే సమయానికి అస్సాం జట్టు 29 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. అలాంటి సమయంలో ఇక రియన్ పరాగ్ బ్యాటింగ్ ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూసారు. అయితే మొదటి బంతి నుంచి ఎంతో దూకుడుగా ఆడటం మొదలుపెట్టిన రియాన్ పరాగ్ 28 బంతుల్లోనే 78 పరుగులు సాధించాడు. 19 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు అని చెప్పాలి. ఇక అతను ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు ఆరు సిక్సర్లు ఉండటం గమనార్హం.

 చివరికి రవితేజ బౌలింగ్లో అటు రోహిత్ రాయుడుకు క్యాచ్ ఇచ్చిన రియాన్ పరాగ్ చివరికి వికెట్ కోల్పోయాడు. హోరా హోరీగా జరిగిన ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టుపై 18 పరుగుల తేడాతో అస్సాం అద్భుత విజయాన్ని అందుకుంది అని చెప్పాలి. అయితే అంతకుముందు సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్లో కూడా రియాన్ పరాగ్ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లోనే 76 పరుగులు చేసి అదరగొట్టిన రియాన్ పరాగ్.. రెండో ఇన్నింగ్స్ లో 95 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అంతకుముందు జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో కూడా తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక తనను తాను ధోని శిష్యుడుగా చెప్పుకుంటూ ఉంటాడు రియాన్ పరాగ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: