కేఎల్ రాహుల్.. నువ్వు సెలెక్టర్లను కంట్రోల్ చేయలేవు : గంభీర్

praveen
గత కొంతకాలం నుంచి టీమిండియాలో సీనియర్ ప్లేయర్లుగా కొనసాగుతున్న కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు పేలవమైన ఫామ్ తో ఇబ్బంది పడుతున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇద్దరు ఓపనర్లు కావడంతో అటు ప్రతి మ్యాచ్లో కూడా టీమ్ ఇండియాకు మంచి ఆరంభం లభించక కష్టాల్లో పడిపోతున్న పరిస్థితి కనిపించింది. ఏకంగా ఆసియా కప్, టి20 వరల్డ్ కప్ లో కూడా ఇక వీరిద్దరి వైఫల్యం కొనసాగింది అని చెప్పాలి. అయితే సీనియర్ క్రికెటర్లు కావడంతో ఇక వీరిద్దరిలో ఎవరో ఒకరిని తప్పించి ఇక మరొకరితో వారి స్థానాన్ని భర్తీ చేసేందుకు రిస్క్ చేయలేకపోయారు భారత సెలక్టర్లు.

 అయితే అటు కెప్టెన్ రోహిత్ శర్మ పేలవమైన ఫామ్ కొనసాగిస్తున్నప్పటికీ కూడా ఇక కెప్టెన్ కావడంతో కాస్త విమర్శల నుంచి తప్పించుకోగలుగుతున్నాడు. అయితే అటు మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ మాత్రం తీవ్రస్థాయిల విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఇటీవల  వైస్ కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ చివరికి ఆ బాధ్యతలను కూడా కోల్పోయాడు అన్న విషయం తెలిసిందే. శ్రీలంకతో జరగబోయే టి20 సిరీస్ లో భాగంగా కేఎల్ రాహుల్ ఒక సాదాసీదా ఆటగాడు గానే జట్టులో చోటు సంపాదించుకున్నాడు.

 ఈ క్రమంలోనే పేలవమైన ఫామ్ తో ఇబ్బంది పడుతున్న కేఎల్ రాహుల్ గురించి అటు మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కేఎల్ రాహుల్  సరైన ప్రదర్శన చేయకుంటే అతడి స్థానాన్ని మరొకరు భర్తీ చేస్తారు అంటూ చెప్పుకొచ్చాడు గౌతం గంభీర్. నువ్వు సెలెక్టర్లను కంట్రోల్ చేయలేవు. శ్రీలంకతో మూడు వన్డేలు ఆడేందుకు ఛాన్స్ వచ్చింది. అదొక్కటే నీ చేతుల్లో ఉంది. నీ పరిధిలో లేని విషయాల గురించి ఆలోచించి ఒత్తిడి పెంచుకోకు అంటూ రాహుల్  కు సూచనలు చేశాడు గౌతమ్ గంభీర్. కాగా ఐపీఎల్ లో రాహుల్ లక్నో కెప్టెన్ గా ఉండగా అదే జట్టుకు మెంటర్గా వ్యవహరిస్తున్నాడు గౌతమ్ గంభీర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: