9వస్థానంలో వచ్చి.. అరుదైన రికార్డు కొట్టిన అశ్విన్?

praveen
గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియాలో సీనియర్ స్పిన్నర్ గా  కొనసాగుతున్న రవిచంద్రన్ అశ్విన్ కి ఆల్రౌండర్ అనే ముద్ర పడింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక కొంతమంది రవిచంద్రన్ అశ్విన్ ను ఆల్ రౌండర్ అనే పదానికి సరైన వ్యక్తి అని అభిప్రాయపడుతూ ఉంటే... అశ్విన్ ఏంటి ఆల్రౌండర్ ఏంటి అని మరి కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇప్పటికే ఎన్నోసార్లు బౌలింగ్లో అద్భుతమైన ప్రదర్శన చేయడమే కాదు బ్యాటింగ్లో కూడా అదరగొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు అశ్విన్.

 ఇటీవల  బంగ్లాదేశ్ తో జరిగిన రెండవ టెస్టు చివరి ఇన్నింగ్స్ లో కూడా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయి ఓటమి అంచుల దగ్గర ఉన్న టీమిండియాను తన అద్భుతమైన ఇన్నింగ్స్ తో విజయ తీరాల వైపుకు నడిపించాడు అశ్విన్. ఈ క్రమంలోనే ఆల్రౌండర్ అనే బిరుదును మరోసారి తన ఆటతీరుతో సార్ధకం చేశాడు అని చెప్పాలి. ఏకంగా కీలకమైన సమయం లో 62 బంతుల్లో 42 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు అని చెప్పాలి. అయితే ఇలా 42 పరుగులతో జట్టుకు విజయాన్ని అందించడమే కాదు అటు ఎన్నో అరుదైన రికార్డులను కూడా ఖాతాలో వేసుకున్నాడు రవిచంద్రన్ అశ్విన్.

 ఈ క్రమంలోనే ఇలా తొమ్మిదో వికెట్ గా వచ్చి 42 పరుగులు చేసిన అశ్విన్ సాధించిన రికార్డులకు సంబంధించిన వార్తలు అటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే టెస్టుల్లో విజయవంతమైన లక్ష్య చేదనలో 9వ స్థానంలో వచ్చి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు.  గతంలో ఈ రికార్డు వెస్టిండీస్ క్రికెటర్ వీస్ టన్ బెంజమిన్ పేరిట ఉండేది. గతంలో 9వ స్థానంలో వచ్చి ఇక 40 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు బెంజమిన్. ఇక ఇప్పుడు అశ్విన్ 42 పరుగులు చేసి ఈ రికార్డును బ్రేక్ చేశాడు అని చెప్పాలి. ఇకపోతే ఇక రెండవ టెస్టు మ్యాచ్లో కూడా విజయం సాధించడంతో బంగ్లాదేశ్ ను 2-0 తేడాతో క్లీన్ స్వీట్ చేసి 2022 ఏడాదిని ఎంతో ఘనంగా ముగించింది టీమిండియా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: