ఏంటి.. సంజూ శాంసన్ తండ్రి కాబోతున్నాడా?

praveen
సాధారణంగా భారత్లో క్రికెటర్లకు ఏ రేంజ్ లో క్రేజీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే క్రికెటర్లకు సంబంధించిన ఏదైనా విషయం సోషల్ మీడియాలోకి వచ్చింది అంటే చాలు అది నిమిషాల వ్యవధిలో వైరల్ గా మారిపోతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే క్రికెటర్ల ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు మాత్రమే కాదు అటు పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు కూడా తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల సంజు శాంసన్ కు సంబంధించిన ఒక వార్త కాస్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

 మంచి టాలెంట్ ఉన్నప్పటికీ అటు టీమ్ ఇండియాలో మాత్రం సరైన అవకాశాలు దక్కించుకోలేకపోతున్నాడు అంటూ గత కొంతకాలం నుంచి సంజు శాంసన్ గురించిన చర్చ సోషల్ మీడియాలో జరుగుతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు సంజు సాంసంగ్ అభిమానులు అందరూ కూడా సంతోషపడే ఒక వార్త వైరల్ గా మారిపోయింది. ఏకంగా సంజు శాంసన్ తండ్రి కాబోతున్నాడట. అయితే ఈ వార్త తెరమిదికి రావడానికి కారణం కూడా లేకపోలేదు. క్రిస్మస్ సందర్భంగా సంజూ  పెట్టిన పోస్ట్ ఇందుకు బలం చేకూరుస్తుంది అని చెప్పాలి.

 క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఇటీవలే సతీమణి చారులతతో కలిసి దిగిన ఫోటోలని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు సంజూ.  ఇక ఇందులో సంజు చారులత ఫోటోలు, ఫోజులకు పెట్టిన క్యాప్షన్ తో అభిమానులు గుర్తుపట్టేశారు. వీటిని చూసిన ఫ్యాన్స్ త్వరలో సంజూ  తండ్రి కాబోతున్నాడు  అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ ఫోటోలో భాగంగా ఇద్దరు నిలబడిన తీరుతో ఇక సంజు  దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారని ఫ్యాన్స్ కన్ఫార్మ్ చేస్తున్నారని చెప్పాలి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మాత్రం సంజూ దీనిపై స్పందించాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: