మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచి.. తర్వాత మ్యాచ్ లోనే వేటుపడిన ఆటగాళ్లు వీళ్లే?

praveen
ఇటీవల కాలంలో టీమిండియా యాజమాన్యం ఎవరిని ఎప్పుడు జట్టులోకి తీసుకువస్తుంది. ఎవరిని ఎప్పుడు పక్కన పెట్టేస్తుంది అన్నది ఊహకంగా విధంగానే మారిపోయింది. బంగ్లాదేశ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో కూడా ఇదే జరిగింది అన్న విషయం తెలిసిందే. మొదటి టెస్ట్ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు రెండో ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు తీసి మంచి ప్రదర్శన కనబరిచాడు కుల్దీప్ యాదవ్. ఎన్నో రోజుల తర్వాత భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చి ఇక తన సత్తా ఏంటో చూపించాడు. అయితే తర్వాత మ్యాచ్ లో మాత్రం అతనికి షాక్ తగిలింది.

 మొదటి టెస్ట్ మ్యాచ్ లో అద్భుతమైన ప్రదర్శన చేసి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ గా నిలిచిన ప్లేయర్ ను తప్పించి 12 ఏళ్లుగా జట్టుకు దూరమైన జయదేవ్ ఉన్నద్గత్ ను తుదిచజట్టులోకి తీసుకున్నారు.. రెండవ టెస్ట్ మ్యాచ్లో రెండు వికెట్లు తీశాడు  జయదేవ్. అయితే ఇప్పటివరకు ఇలా మ్యాన్ అఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకుని ఆ తర్వాత జట్టులో స్థానం  కోల్పోయిన ఆటగాళ్లు ఎవరు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది.. ఆ లిస్టు చూసుకుంటే..

 భువనేశ్వర్ కుమార్ : ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తన చివరి టెస్టును 2018లో దక్షిణాఫ్రికా తో ఆడాడు. ఇక ఆ మ్యాచ్ లో బువి నాలుగు వికెట్లు తీయగా.. ఇక భారత్ విజయం సాధించడంతో భువనేశ్వర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. కానీ ఆ తర్వాత ఇప్పుడు వరకు అతనికి టెస్ట్ జట్టలో అవకాశం రాలేదు.
 అమిత్ మిశ్రా  : చివరిసారిగా 2016లో న్యూజిలాండ్తో భారత్ తరపున వన్డే మ్యాచ్ ఆడాడు. ఇక ఆ మ్యాచ్లో 18 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసి అదరగొట్టాడు.. తర్వాత మాన్ అఫ్ ది మ్యాచ్ దక్కించుకున్నాడు. కానీ ఇప్పటివరకు భారత తరఫున ఒక్క వన్డే మ్యాచ్ లో అవకాశం దక్కించుకోలేదు.
 ప్రజ్ఞాన్ ఓజా : 2013లో సచిన్ టెండూల్కర్ లాగానే ప్రజ్ఞాన్ ఓజా కూడా తన చివరి మ్యాచ్ ఆడాడు.  రెండు ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీసి మాన్ అఫ్ ది మ్యాచ్  దక్కించుకున్నాడు. కానీ ఆ తర్వాత అతనికి ఆడే అవకాశం రాలేదు.
 ఇర్ఫాన్ పఠాన్  : 2012లో భారత జట్టు శ్రీలంకలో పర్యటించినప్పుడు ఇర్ఫాన్ పఠాన్ 29 పరుగులతో ఐదు వికెట్లు పడగొట్టి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.  కానీ ఆ తర్వాత మాత్రం భారత జట్టులో చోటు కోల్పోయాడు.
 బద్రీనాథ్  : చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన సుబ్రమణ్యం బద్రీనాథ్ 2011 టి20 లలో అరంగేట్రం చేసి 43 పరుగులు చేసి భారత్ను గెలిపించాడు. ఇక మ్యాన్ ఆఫ్ ది  మ్యాచ్ గా కూడా ఎంపికయ్యాడు. కానీ ఆ తర్వాత అవకాశాలు లేక కనుమరుగయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: