చరిత్ర సృష్టించిన మెస్సి.. అందులో అతనే నెంబర్.1?

praveen
ఖాతార్ వేదికగా ప్రారంభమై ఇక ప్రపంచ క్రీడా అభిమానులందరికీ కూడా అంతకుమించి అనే రేంజ్ లోనే ఎంటర్టైన్మెంట్ పంచిన ఫిఫా వరల్డ్ కప్ ఇటీవలే ముగిసింది అని చెప్పాలి. ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో చివరికి అర్జెంటీనా జట్టు మూడవసారి ఛాంపియన్గా నిలిచింది. టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన అర్జెంటీనా  జట్టు ఇక తమపై అభిమానులందరూ కూడా పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంది అని చెప్పాలి. అయితే తనకు ఇక ఇదే చివరి వరల్డ్ కప్ అని అటు లియోనల్ మెస్సి  చెప్పిన నేపథ్యంలో ఇక ప్రతి ఒక్కరు కూడా అర్జెంటీనా జట్టు గెలవాలని కోరుకున్నారు అన్న విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే ప్రపంచ క్రీడా అభిమానులు అందరూ కోరుకున్నట్లుగానే చివరికి మెస్సి ప్రాతినిధ్యం వహిస్తున్న అర్జెంటిన జట్టు విజయం సాధించింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఫైనల్ మ్యాచ్ విజయం ద్వారా అర్జెంటీనాకు కెప్టెన్ గా  వ్యవహరిస్తున్న స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సి ఇక ఎన్నో అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి. ఫుట్బాల్ చరిత్రలోనే సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశాడు లియోనాల్ మెస్సి. ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా ఫ్రాన్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ కారణంగా ఇక అత్యధిక మెన్స్ ఫిఫా వరల్డ్ కప్ లో మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా మెస్సి రికార్డు సృష్టించాడు అని చెప్పాలి

 ఇక ఇటీవల ఫ్రాన్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లియోనల్ మెస్సి కెరియర్ లో 26వ వరల్డ్ కప్ మ్యాచ్ కావడం గమనార్హం. కాగా 25 వరల్డ్ కప్ మ్యాచ్లతో ఇప్పటివరకు జర్మనీ ప్లేయర్ లోథర్ మాథ్యూస్ ఇక వరల్డ్ కప్ లలో ఎక్కువ మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా కొనసాగారు. కానీ ఇటీవల జరిగిన ఫైనల్ మ్యాచ్ కారణంగా అర్జెంటీనా జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న మెస్సి ఈ రికార్డును బ్రేక్ చేసి ఫుట్బాల్ చరిత్రలో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశాడు అని చెప్పడంలో అతిశయోక్తి చేయలేదు. ఉత్కంఠ భరితమైన ఫైనల్ పోరులో అర్జెంటీనా విజయం సాధించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: