అభిమానులకి మెస్సి షాకింగ్ న్యూస్?

Purushottham Vinay
టాప్ ఫుట్‌ బాల్‌ ఆటగాళ్లలో ఒకరైన అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ ఇక మళ్లీ ప్రపంచకప్‌లో కనిపించడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా తెలిపాడు. ఈరోజు (డిసెంబర్‌ 18) జరగనున్న ప్రపంచ కప్ 2022 ఫైనల్ తన చివరి వరల్డ్‌కప్‌ మ్యాచ్ అని మెస్పీ స్పష్టం చేసి అభిమానులకు షాక్ ఇచ్చాడు.ఆదివారం నాడు జరిగే ఫైనల్లో అర్జెంటీనా జట్టు ఫ్రాన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందే తన వీడ్కోలుని నిర్ణయాన్ని ప్రకటించాడీ లెజెండరీ ప్లేయర్‌. ఇక మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా టీం సెమీఫైనల్‌లో క్రొయేషియాను ఓడించి టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. ఫైనల్‌లోకి ప్రవేశించిన తర్వాత, లియో మెస్సీ మాట్లాడుతూ, చివరి ఫైనల్ మ్యాచ్ ఆడుతూ 'ప్రపంచ కప్‌లో నా ప్రయాణాన్ని ఫైనల్‌లో పూర్తి చెయ్యడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఇది చాలా సంతృప్తికరంగా ఉంది' అని తెలిపాడు. ఇదిలా ఉంటే లియో మెస్సీ ప్రపంచ ఛాంపియన్‌గా తన ప్రయాణాన్ని ముగిస్తాడా? లేదా? అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా ఉంది. నిజానికి  అర్జెంటీనా తన చివరి ప్రపంచ కప్ ఫైనల్‌ను 2014లో ఆడింది.


అయితే వరల్డ్ ఛాంపియన్ కావాలన్న మెస్సీ కలను జర్మనీ జట్టు విచ్ఛిన్నం చేసింది.'తరువాత ప్రపంచకప్‌కు ఇంకా చాలా సమయం ఉంది. మళ్ళీ ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో ఆడతానని చెప్పలేను. నా ప్రయాణాన్ని ఈ విధంగా ముగించడమే మంచిది. ఈ ఘనత సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక ఫైనల్‌తో ప్రపంచకప్‌ ప్రయాణం ముగిస్తాను. ఈ ఫైనల్‌లో గెలిచి చరిత్ర సృష్టించేందుకు మేం ఒక్క అడుగు దూరంలోనే ఉన్నాం. ప్రపంచకప్‌ కోసం ఖచ్చితంగా నా శాయశక్తులా ప్రయత్నిస్తాను' అని మెస్సీ పేర్కొన్నాడు. ఈ అర్జెంటీనా దిగ్గజం మెస్సికి ఇది 5వ ప్రపంచకప్ కాగా ఇప్పటి దాకా ప్రపంచకప్ చరిత్రలో మొత్తం 11 గోల్స్ చేశాడు. తాజా ప్రపంచకప్‌లో కూడా 5 గోల్స్ చేసి తన జట్టును ఫైనల్ వరకు చేర్చాడు. ఇప్పుడు వరల్డ్‌కప్‌ను సగర్వంగా ఎత్తుకోవాలన్నదే తన ఏకైక లక్ష్యం ఇంకా తన కల. మరి తన కల సాకారమవుతుందా?లేదా?అన్నది మరికొన్ని గంటల్లో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: