వైరల్ : ఫైటర్ జెట్.. ఎలా కుప్పకూలిపోయిందో చూడండి?

praveen
ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో  ఇక ప్రపంచ నలుమూలల్లో చీమ చిట్టుక్కుమన్నా కూడా కేవలం అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో నిమిషాల వ్యవధిలో అన్ని విషయాలను తెలుసుకోగలుగుతున్నాడు మనిషి. ఈ క్రమంలోనే ఇక ఇలా సోషల్ మీడియాలో ప్రతిరోజు కూడా ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఎన్నో రకాల వీడియోలు వైరల్ గా మారిపోతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఏకంగా ఎయిర్ ఫోర్స్ విమానం క్రాష్ కి సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా తెగ చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి.

 అమెరికాకు చెందిన ఎఫ్ 35 బి ఫైటర్ జెట్ విమానం ల్యాండ్ అవుతున్న క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే ఇక విమానం  సేఫ్గా ల్యాండ్ అవుతుంది అని భావించిన అధికారులు ముందుగా ఆ విమానాన్ని వీడియో తీయడం మొదలుపెట్టారు. కానీ ఊహించని రీతిలో ఆ విమానం క్రాష్ కావడంతో ఒక్కోసారిగా షాక్ అయ్యారు. ఈ ప్రమాదంలో ఇక పైలెట్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించాడు అని చెప్పాలి. ఎంతో వేగంగా అప్రమత్తమయ్యి ఇక ఈ ప్రమాదం నుంచి తప్పుకున్నాడు. ఈ ఘటన టెక్సాస్ లోని ఎయిర్ స్టేషన్లో చోటుచేసుకుంది అన్నది తెలుస్తుంది.

 ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదిక వైరల్ గా మారగా ఇది చూసిన ఎంతోమంది నైటిజన్స్ షాక్ అవుతున్నారు. ఎయిర్ స్టేషన్లో ఎఫ్35 విమానం ల్యాండ్ అయ్యేందుకు చాలా నెమ్మదిగా కదులుతున్నట్లు ఇక ఈ వీడియోలో కనిపిస్తుంది. అయితే విమానం ఎంతో దూరం నుంచి ఇక రోడ్డుపై ల్యాండ్ అయ్యి మరికొంత దూరం దూసుకుపోతూ ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా హెలికాప్టర్ తరహాలోనే పైలెట్ విమానాన్ని ల్యాండ్ చేయాలని ప్రయత్నించాడు. కానీ చక్రాలు నేలకు తాకిన అనంతరం జెట్ ఒక్కసారిగా అదుపుతప్పింది. ముందు భాగం నేలను ఢీకొట్టింది. ఇక విమానాన్ని నియంత్రించేందుకు పైలెట్ ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో పైలెట్ సహాయంతో బయటకు వచ్చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: