ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్.. ట్రెండ్ అవుతున్న SBI పాస్ బుక్?

praveen
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో క్రియేటివిటీకి కొదవ లేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే. ఎంతోమంది నెటిజన్లు తమలో ఉన్న క్రియేటివిటీని బయటపెడుతూ ఇక సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ సంపాదించాలని భావిస్తున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు ఇలా నేటిజన్స్ చేసే పనులు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. ఇలాంటి ఆలోచనలు ఎలా వచ్చాయి రా బాబు అని ప్రతి ఒక్కరు కూడా ముక్కున వేలేసుకుంటారు అని చెప్పాలి.  ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వార్త ఒకటి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ప్రస్తుతం కతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ చివరి దశకు చేరుకుంది.

 ఇక ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా ఫైనల్ మ్యాచ్ ఒకటి మిగిలి ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సెమీఫైనల్ లో క్రొయేషియను ఓడించిన అర్జెంటీనా  ఒకవైపు మొరాకోని ఓడించిన ఫ్రాన్స్ మరోవైపు ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఈ ఫైనల్ మ్యాచ్లో ఎవరు విజయతగా నిలుస్తారు అన్నది ఆ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇలాంటి సమయంలోనే స్టేట్ బ్యాంక్ కు సంబంధించిన పాస్బుక్ కవర్ ఫోటో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఇలా ఎస్బిఐ పాస్ బుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోవడానికి ఒక పెద్ద కారణమే ఉంది.

 స్టేట్ బ్యాంక్ పాస్ బుక్ కవర్ ఫోటో అటు అర్జెంటీనా జాతీయ జెండా రంగు దాదాపు ఒకే లాగా ఉండడం గమనార్హం. దీంతో స్టేట్ బ్యాంకు కూడా అర్జెంటీనాకు సపోర్ట్ చేస్తుంది అంటూ ఒక నేటిజన్ ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు. ఇక భారతీయులు అర్జెంటినాకు మద్దతు పలకడం వెనక అసలైన కారణం ఇదే అంటూ మరికొంతమంది కూడా ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ఒక నెటిజన్ క్రియేటివ్ గా ఆలోచించి పెట్టిన పోస్ట్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: