ఏంటి.. సచిన్ కొడుకుని ఇన్నాళ్లు తొక్కేశారా?

praveen
అంతర్జాతీయ క్రికెట్లో భారత లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఎంతల హవా నడిపించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా 20 ఏళ్ల పాటు ఆయన భారత జట్టుకు ప్రాతినిథ్యం  వహించి ఎన్నో మరుపురాని విజయాలను అందించారు. కీలక ఆటగాడిగా మాత్రమే కాకుండా ఏకంగా కెప్టెన్గా కూడా జట్టును ముందుకు నడిపించి విజయాలను అందించారు. భారత్లో క్రికెట్ దేవుడిగా ప్రపంచ క్రికెట్లో లెజెండరీలకే లెజెండరీ క్రికెటర్ గా కొనసాగుతున్నాడు భారత మాజీ సచిన్ టెండూల్కర్.

 లెజెండరీ క్రికెటర్ అయిన సచిన్ కొడుకు క్రికెట్లోకి వస్తే అతనిపై అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ఎన్నడూ కూడా అర్జున్ టెండూల్కర్ అటు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోలేదు అని చెప్పాలి. ఎంతోమంది యువ ఆటగాళ్లు 20 ఏళ్లు కూడా నిండకముందే రంజీ ట్రోఫీలో అవకాశం దక్కించుకొని.. అక్కడ అదరగొట్టి ఇక భారత జట్టులోకి వస్తూ ఉంటే.. అటు అర్జున్ టెండూల్కర్ మాత్రం 23 ఏళ్ళ వయసు వచ్చిన ఒక్కసారి కూడా రంజిల్లో అవకాశం దక్కించుకోలేదు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున కొనసాగుతున్న ఒక్క మ్యాచ్ ఆడలేదు. చివరికి తనకు అవకాశం రావడం లేదని విసుకు చెందిన అర్జున్ టెండూల్కర్ ముంబై నుంచి గోవాకు మారిపోయాడు.
 ఇక గోవా జట్టు తరఫున ఇటీవలే రంజీ ట్రోఫీలో భాగంగా బరిలోకి దిగాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఏ జట్టు తరఫున అయితే ఏంటి అతను మంచి ప్రదర్శన చేసేది లేదు అని అందరూ అనుకున్నారు. కానీ ఇక మొదటి రంజీ మ్యాచ్ లోనే ఏకంగా సెంచరీ తో చెలరేగిపోయాడు అర్జున్ టెండూల్కర్. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఇక గతంలో సచిన్ కూడా 1988లో డిసెంబర్లో తాను ఆడిన మొదటి మ్యాచ్ లోనే సెంచరీ చేశాడు. ఇక ఇప్పుడు అర్జున్ అందరికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.  అదే సమయంలో ఇలాంటి ప్లేయర్ కు ఇన్నాళ్లు ముంబై అవకాశం ఇవ్వలేదు.. అంటే ఎదగకుండా తొక్కేసిందా ఏంటి అని అనుమానాలు ప్రస్తుతం తెరమీదకి వస్తు చర్చనీయాంశంగా మారిపోయాయ్ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: