ఫిఫా వరల్డ్ కప్.. ఫైనల్లో అడుగుపెట్టిన అర్జెంటీనా?

praveen
ఖతార్ వేదికగా ప్రారంభమైన వరల్డ్ కప్ .. ఈ ఏడాది మునుపేన్నడు లేని విధంగా క్రీడా అభిమానులందరికీ అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచింది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఈ ఏడాది ఊహించని ఫలితాలు ప్రతి మ్యాచ్ లో కూడా వెలువడ్డాయి అని చెప్పాలి. దీంతో ప్రేక్షకులు అంచనాల మొత్తం తారుమారయ్యాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఇక ప్రతి మ్యాచ్ ని కూడా వదలకుండా చూసేందుకే క్రీడాభిమానులు అందరూ ఎక్కువగా ఆసక్తి చూపారు. అంతేకాదు ఇక తమ అభిమాన జట్టుకు మద్దతు పలికేందుకు ఏకంగా ఖాతాలో ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించేందుకు కూడా ఎంతో మంది ప్రేక్షకులు తరలి వెళ్లారు అన్న విషయం తెలిసిందే.

 ఇకపోతే ఇక ప్రస్తుతం ఎన్నో రోజుల నుంచి ప్రేక్షకులు అందరికీ కూడా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచుతున్న ఫిఫా వరల్డ్ కప్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే ఇక ఏడాది వరల్డ్ కప్ టైటిల్ గెలవబోయే జట్టు ఏది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే అర్జెంటిన జట్టు ఈసారి టైటిల్ గెలవాలని జట్టు అభిమానులందరూ బలంగా కోరుకున్నారు. ఎందుకంటే ప్రస్తుతం 35 ఏళ్ల వయసులో ఉన్న లియోనాల్ మెస్సికి ఇదే చివరి వరల్డ్ కప్ అని అందరూ భావిస్తున్నారు. ఇక ఇలా తన కెరీర్ లో చివరి వరల్డ్ కప్ లో టైటిల్ గెలిస్తే బాగుంటుందని ఎంతో మంది ఆశపడ్డారు.

 చివరికి అభిమానులు కోరుకున్న దానికి ఒక్క అడుగు దూరంలో ఉంది ప్రస్తుతం అర్జంటీనా జట్టు. ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా సెమీఫైనల్ లో జరిగిన మ్యాచ్లో క్రోయేషియా జట్టును 3-0 ఓడించిన అర్జెంటిన చివరికి ఫైనల్ అడుగుపెట్టింది. కాగా ఫస్ట్ ఆఫ్ లో మెస్సి, అల్వరేజ్ చేరో గోల్ కొట్టడంతో 2-0 ఆధిక్యం వచ్చింది. సెకండ్ హాఫ్ లో అదే జోరును కొనసాగించింది అర్జెంటీనా. అల్వరేజ్ గోలు కొట్టి అర్జెంటినాకు మరింత ఆదిత్యాన్ని అందించాడు. ఇక ఇలా క్రొయేషియానూ చిత్తుగా ఓడించిన అర్జెంటీనా  చివరికి ఫైనల్ లో అడుగుపెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: