ఇండియా బ్యాటింగ్... జట్టులోకి చిచ్చర పిడుగులు !

VAMSI
బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ఇండియా మూడు వన్ డే ల సిరీస్ లో ఈ రోజు ఆఖరి వన్ డే చట్టోగ్రామ్ వేదికగా ఆడనుంది. ఇప్పటికే సిరీస్ ను కైవసం చేసుకున్న ఆతిధ్య బంగ్లాదేశ్ వైట్ వాష్ పైన గురి పెట్టింది. ఢాకా వేదికగా జరిగిన మొదటి రెండు మ్యాచ్ లలో ఇండియా ఓడిపోయి సిరీస్ ను పోగొట్టుకుంది. కాగా కనీసం చివరి మ్యాచ్ లో అయినా గెలిచి పరువును నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది. అయితే రెండవ వన్ డే లో రోహిత్ శర్మ, కుల్దీప్ సేన్ మరియు దీపక్ చహర్ లు గాయపడి ఆఖరి మ్యాచ్ కు దూరం అయ్యారు. ఇక రోహిత్ శర్మ గాయంపై సరైన స్పష్టత లేదు , ఈ మ్యాచ్ తర్వాత జరిగే రెండు టెస్ట్ ల సిరీస్ కు అందుబాటులో ఉంటాడా లేదా అన్నది కూడా తెలియదు.
ఇక ఈ రోజు కాసేపట్లో మ్యాచ్ స్టార్ట్ కానుండగా , ఇండియా జట్టులో రెండు కీలక మార్పులు జరిగాయి. రోహిత్ శర్మ స్థానంలో యంగ్ అండ్ డైనమిక్ వికెట్ కీపర్ బ్యాట్సమాన్ ఇషాన్ కిషన్ జట్టులోకి వచ్చాడు. కాగా ఇషాన్ శిఖర్ ధావన్ తో కలిసి ఓపెనింగ్ చేయనున్నట్లు సమాచారం. ఇక బౌలర్ దీపక్ చాహర్ స్థానంలో మిస్టరీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చాడు. గతంలో తన స్పిన్ తో ప్రత్యర్థులను వణికించిన కుల్దీప్ యాదవ్ మధ్యలో ఫామ్ ను కోల్పోయి కెరీర్ లో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. మళ్ళీ మెల్ల మెల్లగా దేశవాళీ మ్యాచ్ లలో రాణించి ఇపుడిపుడే ఇండియా టీం లో తన స్థానాన్ని మరికొన్ని సంవత్సరాలు పదిలం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
ఈ ఇద్దరు చిచ్చర పిడుగులు కనుక అనుకున్న విధంగా రాణిస్తే ఈ మ్యాచ్ లో గెలవడం అంత కష్టం కాదు. మొదట టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ లిటన్ దాస్ మళ్ళీ తన నిర్ణయాన్ని ఫ్లిప్ చేశాడు. మొదటి వన్ డే లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోగా, రెండవ వన్ డే లో మాత్రం బ్యాటింగ్ తీసుకున్నాడు... ఇప్పుడు టాస్ గెలవగానే మళ్ళీ మొదటి వన్ డే లోలాగా ఫీల్డింగ్ తీసుకున్నాడు. బంగ్లా టీం లో శాంటోకు బదులుగా యాసిర్ అలీని మరియు నాజూమ్ అహ్మద్ బదులు టస్కిన్ అహ్మద్ లను జట్టులోకి తీసుకున్నారు. మరి మొదట బ్యాటింగ్ చేయనున్న ఇండియా బంగ్లా ముందు బలమైన లక్ష్యను ఉంచుతుందా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: