ఇదేం బౌలింగ్ రా స్వామి.. డబ్ల్యూ మ్యాచ్ లోనే ఏడు వికెట్లు?

praveen
సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఆటగాడికి మొదటి మ్యాచ్ లో తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ముందుగా మ్యాచ్లో ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఇక కొత్తగా జట్టులోకి వచ్చిన వాళ్ళకి ఎంతో ఎక్కువ సమయం పడుతూ ఉంటుంది. అయితే కొంతమంది ప్లేయర్లు మాత్రం తాము అంతర్జాతీయ క్రికెట్లో ఆడుతుంది మొదటి మ్యాచ్ అయినప్పటికీ అప్పటికే ఎంతో అనుభవం సాధించిన ప్లేయర్ల లాగా మంచి ప్రదర్శనతో ఆశ్చర్యపరచడం లాంటివి చేస్తూ ఉంటారు.

 ఇలా డెబ్యూ ప్లేయర్ ఎవరైనా అసమాన్యమైన ప్రదర్శనతో అదరగొట్టాడు అంటే చాలు ప్రపంచ క్రికెట్లో అది కాస్త హాట్  టాపిక్గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల  పాకిస్తాన్ జట్టులోకి అరంగేట్రం చేసిన యువ సంచలనం అబ్రార్ అహ్మద్ తన ప్రదర్శనతో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఏకంగా అరంగేట్రం మ్యాచ్లోనే వరుసగా ఏడు వికెట్లు పడగొట్టి క్రికెట్ ప్రపంచం దృష్టిని మొత్తం తన వైపుకు తిప్పుకున్నాడు అని చెప్పాలి. ఏకంగా ప్రపంచ క్రికెట్లో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లను తన స్పిన్ బౌలింగ్ తో వరుసగా పెవిలియన్ చేర్చాడు ఈ లెగ్ స్పిన్నర్.

 ఓపెనర్ జాక్ క్రాలేను 19 పరుగులకే పెవిలియన్ పంపాడు. తర్వాత బెన్ డకెట్ను 63 పరుగుల వద్ద, హోలీ పోప్ ను 60 పరుగుల వద్ద అవుట్ చేశాడు. ముఖ్యంగా డకెట్ ను ఎల్ బి డబ్ల్యు చేసిన విధానం అయితే అందరిని ఆకర్షించింది అని చెప్పాలి. ఆ తర్వాత  జో రూట్, హ్యారి బ్రూక్స్, కెప్టెన్ బెన్స్ స్ట్రోక్స్ వికెట్లను కూడా తీశాడు. మొత్తంగా ఇక తన డెబ్యూ మ్యాచ్ లోనే ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు అని చెప్పాలి. ఇక అద్భుతమైన ఫామ్ లో ఉన్న వెల్ జాక్స్ వికెట్ కూడా తీసుకోవడం గమనార్హం. దీంతో అతను ఫ్యూచర్ స్టార్ అంటూ ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు ప్రశంసలతో ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: