రోహిత్ స్థానంలో.. జట్టులోకి రాబోయే ఆటగాడు ఎవరో తెలుసా?

praveen
ప్రస్తుతం భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనలో ఉంది. సీనియర్ ఆటగాళ్లతో కూడిన టీమిండియా జట్టు ప్రస్తుతం ఆతిథ్య బాంగ్లాదేశ్ తో వన్ డే సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ వన్డే సిరీస్ లో ఎంతో మెరుగైన ప్రదర్శన చేస్తుంది అనుకున్న టీమ్ ఇండియా జట్టు అభిమానులందరి అంచనాలను కూడా తారుమారు చేసేసింది అన్న విషయం తెలిసిందే. వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోయి ఏకంగా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను కోల్పోయింది టీమిండియా జట్టూ. బలహీనమైన బంగ్లాదేశ్ పై కూడా గెలవలేక చివరికి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటుంది అని చెప్పాలి.

 అయితే ఇప్పటికే వరుస ఓటములు కారణంగా అటు టీమిండియా పై దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంటే మరోవైపు ఇక జట్టులో ఉన్న కీలక ఆటగాళ్లు గాయం బారిన పడుతూ దూరమవుతూ ఉండడం.. ఇక అటు టీం ని మరింత బలహీన పరుస్తూ ఉంది అని చెప్పాలి. ఇటీవల కెప్టెన్ రోహిత్ శర్మ చేతి కావడం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అయితే గాయం ఉన్నప్పటికీ రెండో వన్డే మ్యాచ్లో బ్యాటింగ్ చేశాడు రోహిత్ శర్మ. కాని జట్టును గెలిపించలేకపోయాడు. కానీ తర్వాత మూడో వన్డే మ్యాచ్ తో పాటు టెస్టు సిరీస్ కి కూడా దూరం కాబోతున్నాడు అని అటు కోచ్ రాహుల్ ద్రావిడ్ క్లారిటీ ఇచ్చాడు అన్న విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేయబోయే కొత్త ఆటగాడు ఎవరు అన్న విషయం తెలుసుకునేందుకు కూడా ప్రస్తుతం అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు అని చెప్పాలి. అయితే బంగ్లాదేశ్ తో జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ గాయపడడంతో వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరించే అవకాశం ఉంది. అయితే రోహిత్ శర్మ స్థానంలో ఆడేందుకు యువ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. అదే సమయంలో గాయపడిన షమి స్థానంలో బెంగాల్ సీమర్ ముఖేష్ కుమార్కు అవకాశం దక్కబోతున్నట్లు తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: