మా వాడిని ఎంపిక చేయకపోవడమే మంచిదైంది : ఉమ్రాన్ తండ్రి

praveen
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఐపీఎల్లో తన బౌలింగ్ తో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు కాశ్మీరీ బౌలర్ ఉమ్రాన్ మాలిక్. ఏకంగా టీమ్ ఇండియా స్టార్ బౌలర్లకు సైతం సాధ్యం కాని రీతిలో 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులను విసురుతూ ఇక టీమిండియా భవిష్యత్తును నిర్ణయించె ఆటగాడిని తానే అన్న నమ్మకాన్ని అందరిలో కల్పించాడు అని చెప్పాలి. దీంతో మాజీ ఆటగాళ్లు అతనిపై ప్రశంసలు కురిపించడమే కాదు ఏకంగా అతని వెంటనే టీమిండియాలోకి తీసుకోవాలంటూ డిమాండ్లు కూడా చేశారు.

 ఐపీఎల్ లో ప్రతిభ చాటిన ఆటగాళ్లు ఎంతోమంది ఉన్నా అటు ఉమ్రాన్ మాలిక్ కు మాత్రం తక్కువ సమయంలోనే టీమ్ ఇండియాలో అవకాశం దొరికింది. అయితే టీమిండియా తరఫున ఆడిన ఉమ్రాన్ మాలిక్ తన బౌలింగ్ వేగంతో ఆకట్టుకున్నప్పటికీ ఇక లైన్ అండ్ లెంత్ సరిగా లేకపోవడంతో భారీగా పరుగులు సమర్పించుకుని ఇక జట్టులో స్థానం కోల్పోయాడు. ఉమ్రాన్ మాలిక్ని అటు ఆస్ట్రేలియాలో జరిగిన వరల్డ్కప్ లో ఎంపిక చేసి ఉంటే బాగుండేదని అక్కడి పిచ్ లు అతనికి బాగా కలిసి వచ్చేవి అని అందరూ భావించారు. ఇకపోతే ఇటు ఇటీవల  ఇదే విషయంపై ఉమ్రాన్ మాలిక్ తండ్రి అబ్దుల్ రషీద్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 ఉమ్రాన్ మాలిక్ ప్రపంచ జట్టులో స్థానం సంపాదించుకోలేక పోయాడు అంటూ అందరూ అంటున్నారు. కానీ అతడు ప్రపంచకప్ జట్టులో ఆడక పోవడం కూడా  మంచిదే. ఎందుకంటే అతను వరల్డ్ కప్ లో అరంగేట్రం కోసం ఇంతకన్నా మంచి సందర్భం ఏదో ఉందని మేము నమ్ముతూ ఉన్నాం. ఇక ఇప్పుడు ఏది జరగాలో అది జరుగుతుంది. ఉమ్రాన్ మాలిక్ ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడు. ఇప్పుడే దేశం తరఫున ఆడాలని తొందరపడటం లేదు. అతడు సీనియర్లతో డ్రెస్సింగ్ రూమ్ను పంచుకుంటున్నాడు. వారి ద్వారా ఎన్నో కొత్త విషయాలను కూడా తెలుసుకొని అనుభవం సాధిస్తున్నాడు. మంచి ప్రదర్శన చేసినప్పుడు అవకాశాలు అవే వెతుక్కుంటూ వస్తాయి అంటూ అబ్దుల్ రషీద్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: