అప్పుడు 92 వేల మంది.. ఇప్పుడు మాత్రం గ్రౌండ్.. ఆలోచించాల్సిందే?

praveen
ఇటీవల కాలంలో టి20 ఫార్మాట్లో అన్ని దేశాల క్రికెట్ బోర్డులు కూడా దేశీయ లీగులు ప్రారంభిస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఈ దేశీయ లీగ్ లకు ప్రమోషన్స్ కూడా భారీగానే చేసుకుంటూ ఉన్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్ ప్లేయర్ లందరూ ఈ లీగ్లలో భాగం అవుతూ ఉన్నారు అని చెప్పాలి. దీంతో ఇక ఎన్ని రకాల దేశీయ లీగులు పుట్టుకొచ్చిన కూడా అవన్నీ ఎంతో పాపులారిటీ సంపాదిస్తూ సూపర్ సక్సెస్ అవుతున్నాయి అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఏకంగా ప్రపంచ క్రికెట్లో కొన్ని ఫార్మాట్లకు గడ్డు పరిస్థితులు ఏర్పడుతున్నాయని.. గత కొంతకాలం నుంచి మాజీ క్రికెటర్లు చర్చించుకుంటున్నారు.

 అయితే దేశీయ లీగులకు బాగా అలవాటు పడిపోయిన ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు ఇక ద్వైపాక్షిక సిరీస్లను చూడటం విషయంలో కూడా ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు అని చెప్పాలి. ప్రపంచకప్ జరిగినప్పుడు స్టేడియం మొత్తం నిండిపోయిన ప్రేక్షకులు.. ద్వైపాక్షిక సిరీస్ ల సమయంలో మాత్రం ఒక్కరు కూడా స్టేడియం కు వచ్చి మ్యాచ్ వీక్షించేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు అని చెప్పాలి. ఇక ఇటీవల ఇదే విషయంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి.

 ద్వైపాక్షిక  సిరీస్ లకు రోజురోజుకీ ఆదరణ తగ్గుతుంది అన్నదానికి నిదర్శనంగా ఒక ఫోటోని తన సోషల్ మీడియాలో పంచుకున్నాడు. కొన్ని రోజుల క్రిందట ముగిసిన టి20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ టైటిల్ విజేతగా నిలిచింది. అయితే ఆ తర్వాత మూడు రోజులకే ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ జరిగింది. ఆడిలైట్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్కు రావడానికి ప్రేక్షకులు ఏ మాత్రం ఆసక్తి చూపలేదు. మైదానం మొత్తం ఖాళీగా కనిపించింది. అయితే ఇదే గ్రౌండ్లో నెల కిందట ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే 92,000 మంది ప్రేక్షకులు వచ్చారు. దీంతో మైదానం ఎక్కడ చూసినా కిక్కిరిసిపోయింది. దీనిపై నిజంగా తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటూ షోయబ్ అక్తర్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: