సూర్యకుమార్ యాదవ్ అనుకున్నట్టే ఫెయిల్ అయ్యాడుగా !

VAMSI
ప్రస్తుతం టీ20 ఇంటర్నేషనల్ స్థాయిలో వరల్డ్ నెంబర్ వన్ బ్యాట్స్మన్ గా ఇండియాకు చెందిన సూర్యకుమార్ యాదవ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. రీసెంటుగా ముగిసిన సూర్య ఆసియా కప్ , సౌత్ ఆఫ్రికా సిరీస్ మరియు వరల్డ్ కప్ లలో ఆకాశమే గడ్డుగా చెలరేగి ఆడి నెంబర్ వన్ ర్యాంక్ ను సొంతం చేసుకున్నాడు. ఇక తాజాగా న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ఇండియా ఇప్పటికే టీ 20 సిరీస్ ను గెలుచుకుని మంచి ఊపుమీద ఉంది. రెండవ టీ 20 లో సూర్య కుమార్ యాదవ్ రికార్డ్ లెవెల్ లో సెంచరీ సాధించి ఇండియాకు విజయాన్ని అందించాడు. ఇక ఈ రోజు నుండి ప్రారంభం అయిన మూడు వన్ డే ల సిరీస్ లో భాగంగా మొదటి వన్ డే ఆక్లాండ్ లో జరుగుతోంది.
మొదట టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ విలియమ్సన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇండియా ఓపెనర్లు శిఖర్ ధావన్ (72) మరియు శుబ్మాన్ గిల్ (50) లు మొదటి వికెట్ కు 124 పరుగులు జోడించి వరుస ఓవర్ లలో అవుట్ అయ్యారు. వన్ డౌన్ గా వచ్చిన శ్రేయాస్ అయ్యర్ నెమ్మదిగా ఇన్నింగ్స్ ను నిర్మించే బాధ్యతను తీసుకున్నాడు. సెకండ్ డౌన్ లో వచ్చిన పంత్ కాసేపు నెమ్మదిగానే ఆడినా ఫెర్గుసన్ బౌలింగ్ లో ర్యాష్ షాట్ ఆడి బౌల్డ్ అయ్యాడు. మాములుగా ఒక ఓవర్ లో వికెట్ పడ్డాక నెమ్మదిగా ఆడడం ఆ తర్వాత వచ్చే బ్యాట్స్మన్ కనీస బాధ్యత. కానీ మన టీ 20 సూపర్ స్టార్ తాండిన మొదటి బంతిని ఫోర్ గా మలిచాడు. ఆ తర్వాత మూడవ బంతికే స్లిప్ లో అలెన్ కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు.
మ్యాచ్ కు ముందుగానే క్రికెట్ ప్రముఖులు సందేహించినట్లుగానే టీ 20 లలో లాగా దూకుడుగా ఆడదానికి అలవాటు పడిన సూర్యకుమార్ యాదవ్ ఏ విధంగా వన్ డే లలో ఆడుతాడో చూడాలి అని అన్నదానికి, ఏ మాత్రం సహనం లేకుండా ఆడిన మూడు బంతుల్లోనే పెవిలియన్ బాట పట్టడంతో ఫ్యాన్స్ అంతా నిరాశ పడ్డారు. కనీసం క్రీజులో నిలబడి కొన్ని బంతులు ఆడితే పిచ్ స్వభావం మరియు బౌలర్ల గురించి అర్దమవుతుంది. ముందు ముందు సూర్య అన్ని ఫార్మాట్ లలో స్థానం సంపాదించుకుని రాణించాలంటే ఖచ్చితంగా టెంపర్ మెంట్ తగ్గించుకుని ఓపికగా ఆడాల్సిందే. మరి ఇక మిగిలిన రెండు వన్ డే లలో ఎలా ఆడుతాడో చూద్దాం.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: