టీమిండియా బౌలర్లు అరుదైన ఘనత.. ఇదే తొలిసారి?

praveen
టి20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే టీమిండియా జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ పర్యటనలో భాగంగా టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ  విశ్రాంతి తీసుకోవడంతో హార్దిక్ పాండ్యాకు తాతకాలిక కెప్టెన్గా బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో న్యూజిలాండ్తో టి20 సిరీస్ ఆడింది టీం ఇండియా జట్టు. అయితే ఈ టి20 సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ వర్షర్పణ  కావడంతో క్రికెట్ ప్రేక్షకులు ఎంతగానో నిరాశలో మునిగిపోయారు అని చెప్పాలి. కానీ రెండవ మ్యాచ్లో మాత్రం టీమిండియా అద్భుతంగా రానించి విజయం సాధించింది.

 ఇకపోతే ఇటీవలే మూడో మ్యాచ్ జరిగింది అని చెప్పాలి. అయితే మూడో మ్యాచ్లో భాగంగా అటు టీమ్ ఇండియా బౌలర్లు అద్భుతమే చేశారు. 130 పరుగుల వద్ద కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి భారీ స్కోరు దిశగా పయనించింది న్యూజిలాండ్ జట్టు.  అలాంటి సమయంలోనే మరోసారి స్పెల్ వేయడానికి వచ్చిన మహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్ లు తమ బౌలింగ్ తో అదరగొట్టారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇద్దరు కూడా చేరో నాలుగు వికెట్లు తీసుకొని న్యూజిలాండ్ జట్టును 160 పరుగులకు ఆల్ ఔట్ చేసేసారు. కేవలం 30 పరుగుల వ్యవది లోనే 8 వికెట్లు తీశారు.  ఇక ఇద్దరు బౌలర్లు కూడా తమ కెరియర్ లోనే బెస్ట్ గణాంకాలు నమోదు చేశారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 ఈ క్రమంలోనే భారత బౌలింగ్ విభాగం ఒక అరుదైన ఘనతను సాధించింది అని చెప్పాలి. సిరాజ్ కంటే ముందు దీపక్ కూడా ఇదే సిరీస్ లో రెండో టి20 మ్యాచ్ లో పది పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు.  ఇక 2021 లో కూడా కోల్కతా వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో అక్షర పటేల్ తొమ్మిది పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీయడం అత్యుత్తమ ప్రదర్శన కాగా.. ఇక ఇప్పుడు న్యూజిలాండ్తో టి20 మ్యాచ్లో టీమిండియా కు చెందిన ఇద్దరు బౌలర్లు చెరో నాలుగు వికెట్లు తీశారు అని చెప్పాలి. ఇక ఇప్పటివరకు ఇదే అత్యుత్తమంగా కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: