కోహ్లీకి విశ్రాంతి.. భార్యతో కలిసి ఎక్కడికెళ్లాడో తెలుసా?

praveen
మొన్నటి వరకు ఫామ్ లేమీతో తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ తన మునుపటి ఫామ్ అందుకొని ఇక ఇటీవల వరల్డ్ కప్  లో ఎంత ఈ విధ్వంసం సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకవైపు టీమిండియా ఆటగాళ్లు అందరూ కూడా పేలవ ప్రదర్శనతో చేతులెత్తేస్తున్న సమయంలో కూడా విరాట్ కోహ్లీ మాత్రం కష్ట సమయాల్లో కూడా పరుగులు రాబడుతూ జట్టును విజయతీరాల వైపుకు నడిపించాడు అని చెప్పాలి. అయితే భారత జట్టు అటు సెమీఫైనల్ లో ఓడిపోయి ఇంటి బాట పట్టినప్పటికీ విరాట్ కోహ్లీ ప్రదర్శన మాత్రం అటు వరల్డ్ కప్ చరిత్రలో నిలిచిపోయింది.

 ఎందుకంటే ఇక ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన వరల్డ్కప్ లో భాగంగా విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్ గా నిలిచాడు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇప్పుడు టీం ఇండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లగా రోహిత్ విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ లాంటి సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ప్రకటించింది టీమిండియా యాజమాన్యం. ఈ క్రమంలోనే ఈ విశ్రాంతి సమయాన్ని ఎంతో సరదాగా గడుపుతున్నాడు విరాట్ కోహ్లీ. ఈ క్రమంలోనే ఈ ఖాళీ సమయాన్ని వినియోగించుకునేందుకు తన భార్య అనుష్క శర్మతో కలిసి ఉత్తరాఖండ్ వెకేషన్కు వెళ్ళాడు.

 ఇక అక్కడ అందమైన ప్రదేశాలలో ఈ స్టార్ కపుల్స్ తిరుగుతూ తెగ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఆయా ప్రదేశాలలో ఈ స్టార్ కపుల్స్ ని చూసిన ఎంతోమంది అభిమానులు వీరితో ఫోటోలు దిగుతూ ఇక ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఉత్తరాఖండ్ వెకేషన్ లో భాగంగా విరాట్ కోహ్లీతో కొంతమంది అభిమానులు ఫోటోలు దిగి అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయాయ్ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: