బట్లర్ ముందే చెప్పాడు.. చివరికి టీమిండియా ఓడింది?

praveen
మొన్నటి వరకు లీగ్ మ్యాచ్లలో అదిరి పోయే ప్రదర్శనతో వరుస విజయాలు సాధిస్తూ వచ్చిన టీమిండియా జట్టు.. ఇక ఇటీవలే కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్లో మాత్రం చేతులెత్తేసింది అన్న విషయం తెలిసిందే. ఇంగ్లాండు ప్రదర్శన దాటికి తట్టుకోలేక పోయినా భారత జట్టు ఏకంగా పది వికెట్ల తేడాతో ఘోర ఓటమినీ చవిచూసింది. సెమీఫైనల్ లో గెలిచి అటు ఫైనల్ కు చేరుతుంది అనుకుంటే అటు భారత జట్టు మాత్రం తీవ్రస్థాయిలో నిరాశపరిచింది అని చెప్పాలి.

 అయితే మొదట బ్యాటింగ్ విభాగంలోనే విఫలమైన భారత జట్టు ఆ తర్వాత బౌలింగ్ విభాగంలో కూడా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది అని చెప్పాలి. ఏకంగా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ లు జాబ్స్ బట్లర్  అలెక్స్ హేల్స్ తమ బ్యాటింగ్ విధ్వంసంతో ఇక సునామీ సృష్టించారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎక్కడ ఇండియా బౌలర్లకు అవకాశం ఇవ్వకుండా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే 167 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చేదించింది ఇంగ్లాండు.

 అయితే టి20 వరల్డ్ కప్ లో భాగం గా భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఉంటుందని అందరూ భావించారు. మరో సారి దాయాదుల పోరు ఉంటే ఇక ఆ కిక్కే వేరు అని ఎంతో మంది కామెంట్ కూడా చేసారు. కానీ ఇదే విషయంపై స్పందించిన ఇంగ్లాండు కెప్టెన్ జాస్ బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎట్టి పరిస్థితుల్లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఉండకూడదని సెమీఫైనల్ లో ఇండియాను ఓడిస్తాం అంటూ ధీమా వ్యక్తం చేసాడు. ఇక జాస్ బట్లర్ కేవలం మాటల్లో చెప్పడం మాత్రమే కాదు తన ఆట  తీరులో కూడా ఇక చెప్పింది చేసి చూపించాడు. ఇక ప్రేక్షకులు అందరూ ఎదురుచూసిన భారత్ పాకిస్తాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ లేకుండా చేసి ఇక తమ జట్టుకు విజయాన్ని అందించాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: