వరల్డ్ కప్ వైఫల్యం.. బవుమాపై వేటు.. కొత్త కెప్టెన్ గా ఎవరంటే?

praveen
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఊహించని సంచలనాలు నమోదు అయ్యాయి అనే విషయం తెలిసిందే. ఏకంగా చిన్న జట్లు ఛాంపియన్ జట్లకు ఊహించని షాక్ ఇచ్చాయి. అద్భుతమైన పోరును కొనసాగించి వరుస విజయాలతో దూసుకుపోయాయి. అయితే ఏ చిన్న జట్టు కూడా సెమీఫైనల్ లో అర్హత సాధించలేకపోయినప్పటికీ ఇక తమ ఆట తీరుతో ఎంతలా ప్రభావం చూపించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఇటీవల సూపర్ 12 మ్యాచ్ లో భాగంగా కీలకమైన పోరులో ఏకంగా భయంకరమైన దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్ ఓడించడం క్రికెట్ ప్రపంచాన్ని మొత్తం ఆశ్చర్యానికి లోను చేసింది.

 ఇక ఈ మ్యాచ్ ఫలితంతో అప్పటివరకు వరల్డ్ కప్ లో ఉన్న సమీకరణాలు మొత్తం ఒక్కసారిగా మారిపోయాయి అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే వరల్డ్ కప్ లో పరిణామాలు దక్షిణాఫ్రికా జట్టులో కొన్ని కీలకమైన మన మార్పులకు నాంది పలకడానికి దారి తీసినట్లే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కెప్టెన్ టెంప భావుమా పై వేటుపడే అవకాశం లేకపోలేదు అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే మరికొన్ని రోజులు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంచనా.

 తెంపా భావుమాను అటు కెప్టెన్సీ నుంచి తొలగించి.. కేవలం ఒక సాదాసీదా సభ్యుడుగా మాత్రమే జట్టులో కొనసాగించేందుకు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు నిర్ణయించిందట. ఇక దక్షిణాఫ్రికా జట్టు సారథిగా మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ తో అదరగొడుతున్న డేవిడ్ మిల్లర్  లేదంటే క్వింటన్ డీకాక్ పేర్లను దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు పరిశీలిస్తుందట. దీనికి సంబంధించి ఇప్పటికే సెలెక్టర్లు కూడా చర్చలు జరుపుతున్నారట. ఇక మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే డేవిడ్ మిల్లర్ కు కెప్టెన్సీ అప్పగిస్తే ఎక్కువ ఒత్తిడి పడుతుంది అని భావించిన సెలెక్టర్లు ఇక క్వింటన్ డీకాక్ కు కెప్టెన్సీ అప్పగించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: