ప్రేక్షకులు కోరుకుందే జరిగింది.. మరోసారి ఇండియా -పాక్ మ్యాచ్?

praveen
సాధారణంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ దాయాదుల పోరును వీక్షించేందుకు క్రికెట్ ప్రపంచం మొత్తం ఎప్పుడు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ రెండు జట్లు కేవలం ఐసీసీ నిర్వహించే టోర్నీలలో మాత్రమే తలబడుతూ ఉండడంతో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కి ఉన్న క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇకపోతే వరల్డ్ కప్ లో అటు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగిందంటే చాలు అప్పటివరకు మిగతా మ్యాచ్లకు సంబంధించిన టిఆర్పి రికార్డులు అన్నీ కూడా బద్దలు అవుతూ ఉంటాయి. కాగా ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ లో ఇప్పటికే పాకిస్తాన్ భారత్ మధ్య మ్యాచ్ జరిగింది.

 నరాలు తెగే ఉత్కంఠ మధ్య చివరి బంతి వరకు సాగిన ఈ మ్యాచ్ లో భారత జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది అని చెప్పాలి.  ఇక ఆ తర్వాత రెండు విజయాలు ఒక ఓటమితో ఆరు పాయింట్లు సాధించింది టీమిండియా. అయితే అటు వరుసగా రెండు ఓటములతో సెమీస్ నుంచి తప్పుకుంటుంది అనుకున్న పాకిస్తాన్ అనూహ్యంగా పుంజుకుని భారీ విజయాలతో మళ్ళీసెమీస్ రేస్ లోకి వచ్చింది.

 దీంతో గ్రూప్ 2 లో ఉన్న టీమిండియా, పాకిస్తాన్ అటు సెమి ఫైనల్లో అవకాశాలు దక్కించుకోవాలని ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు కోరుకున్నారు.  సెమిస్లో ఛాన్స్ కొట్టేయడమే కాదు అటు గ్రూప్ వన్ లో ఉన్న మిగతా రెండు జట్లను ఓడించి ఈ పాకిస్తాన్ భారత్ జట్లు ఫైనల్లో తలబడితే బాగుండు అని ఆశపడ్డారు.  అయితే ఇలా ప్రేక్షకులు గట్టిగానే కోరుకున్నట్టున్నారు.  ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ కు సెమీ ఫైనల్ వెళ్లేందుకు మార్గం సుగమం అయింది. ఇటీవల నెదర్లాండ్స్ చేతిలో సౌత్ ఆఫ్రికా ఓడిపోవడంతో ఐదు పాయింట్లతో ఇక వరల్డ్ కప్ నుండి సౌత్ ఆఫ్రికా నిష్క్రమించే పరిస్థితి వచ్చింది  ఇక బంగ్లాదేశ్ పై పాకిస్తాన్ గెలిచిందంటే సమీకరణలు లేకుండానే సెమీస్ లో అడుగుపెడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: