టీమిండియా కూడా ఇంటికే.. పాక్ మాజీ షాకింగ్ కామెంట్స్?

praveen
ఈ ఏడాది పటిష్టమైన జట్లలో ఒకటిగా బరిలోకి దిగింది భారత దాయాది దేశమైన పాకిస్తాన్  అయితే బ్యాటింగ్ విభాగంలో బౌలింగ్ విభాగంలో ఎంతో పటిష్టంగా కనిపించినప్పటికీ ఒత్తిడికి మాత్రం పాకిస్తాన్ జట్టు తలవంచింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే పటిష్టమైన పాకిస్తాన్ చేతిలో ఓడిపోయి మొదటి మ్యాచ్ లోనే తీవ్రంగా నిరాశపరిచిన పాకిస్తాన్ జట్టు.. ఆ తర్వాత పసికూన జింబాబ్వే చేతిలో కూడా ఒక్క పరుగు తేడాతో ఓటమి చవిచూసింది అని చెప్పాలి. ఇలా వరుస ఓటముల కారణంగా ఇక పాకిస్తాన్ అటు సెమీస్ చేరే అవకాశాలను దాదాపు కోల్పోయింది అని ఎంతో మంది విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 ఇలాంటి సమయంలోనే ఇక పాకిస్తాన్ పేలవ ప్రదర్శన పై.. కెప్టెన్సీ వైఫల్యంపై కూడా ఆ దేశ ఆజీ ఆటగాళ్లు స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్ మార్చాల్సిన అవసరం ఉందంటూ కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉండడం  గమనార్హం. అయితే ఇటీవల ఇదే విషయంపై స్పందించిన పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఒకవైపు పాకిస్తాన్ వైఫల్యాన్ని గురించి మాట్లాడుతూనే మరోవైపు టీమిండియా పై తన అక్కస్సును వెళ్లగక్కాడు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే షోయబ్ అక్తర్  చేసిన వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి. మొదట పాకిస్తాన్ ప్రదర్శన పై ఫైర్ అయ్యాడు. తర్వాత భారత్ గురించి మాట్లాడుతూ.  టీమిండియా ఏం తీసి మార్ ఖాన్ కాదు. వచ్చేవారమే ఆ జట్టు కూడా ఇంటికి వచ్చేస్తుంది అంటూ జోష్యం చెప్పాడు. భారత్ పాకిస్తాన్ జట్ల భవితవ్యం ఏంటో టోర్నీకి ముందే చెప్పాను  ఇప్పుడు పాకిస్తాన్ ఇంటిదారి పట్టింది. ఇక టీమ్ ఇండియాకు కూడా ఇదే గతి పడుతుంది అంటూ షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: