స్కాట్లాండ్ ఆశలు ఆవిరి... సూపర్ 12 కు జింబాబ్వే !

VAMSI
ఈ రోజు స్కాట్లాండ్ మరియు జింబాబ్వేల మధ్యన జరిగిన ఆఖరి క్వాలిఫైయర్ మ్యాచ్ తో అసలు సమరానికి రంగం సిద్ధమైంది. వరల్డ్ కప్ టీ 20 లో క్వాలిఫైయర్ దశలో గత ఆరు రోజులుగా మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఇందులో మొత్తం ఎనిమిది జట్లు తమ శక్తికి మించి సూపర్ 12 కు వెళ్ళడానికి ప్రయత్నించాయి. అయితే కేవలం నాలుగు జట్లు మాత్రమే మెయిన్ డ్రా కు అర్హత సాధించే అవకాశం ఉండడంతో మిగిలిన నాలుగు జట్లకు నిరాశే మిగిలింది. గ్రూప్ ఏ లో శ్రీలంక, నెదర్లాండ్ , నమీబియా మరియు యూఏఈ లు ఉండగా... శ్రీలంక నెదర్లాండ్ లు మాత్రమే సూపర్ 12 కు చేరుకున్నాయి. మిగిలిన రెండు జట్లకు నిరాశే మిగిలింది.
గ్రూప్ బి లో జింబాబ్వే , ఐర్లాండ్ , స్కాట్లాండ్ మరియు వెస్ట్ ఇండీస్ లో ఉండగా... జింబాబ్వే మరియు ఐర్లాండ్ లు క్వాలిఫై కాగా మిగిలిన రెండు జట్లు ఇంటిదారి పట్టాయి. గ్రూప్ బి లో జరిగిన మొదటి మ్యాచ్ లో స్కాట్లాండ్ అద్బుతమయిన ప్రదర్శనతో రెండు సార్లు ట్రోపీ గెలిచిన వెస్ట్ ఇండీస్ ను ఓడించి బలమైన్ సంకేతాన్ని పంపించింది. కానీ ఆ తర్వాత ఐర్లాండ్ మరియు జింబాబ్వే లతో జరిగిన కీలక మ్యాచ్ లలో ఓడిపోయి అర్హతను సాధించడంలో విఫలం అయింది.  ఈ రోజు మధ్యాహ్నం జరిగిన మ్యాచ్ లో స్పీతోలాండ్ చేతిలో అయిదు వికెట్ల తేడాతో ఓడింది.
మొదట టాస్ గెలిచిన స్కాట్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఉదయం అదే విధంగా టాస్ గెలిచిన వెస్ట్ ఇండీస్ బ్యాటింగ్ ఎంచుకుని మ్యాచ్ ను పోగొట్టుకుంది. ఆ మ్యాచ్ ను చూసిన స్కాట్లాండ్ మళ్ళీ అదే తప్పును చేసి ఓటమిని కొనితెచ్చుకుంది. స్కాట్లాండ్ నిర్ణీత ఓవర్ లలో కేవలం 132 పరుగులు మాత్రమే చేసింది. ఇందులో ఓపెనర్ మున్సీ ఒక్కడే 54 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. జింబాబ్వే బౌలర్లలో చతారా, ఎంగరవా తలో రెండు వికెట్లు తీసుకున్నారు. ఛేదనలో జింబాబ్వే కు మొదట్లో షాక్ తగిలినా ఏమాత్రం తడబడకుండా లక్ష్యాన్ని చేధించింది. జింబాబ్వే లో ఎర్విన్ 58 పరుగులు మరియు సికందర్ రాజా 40 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్రా పోషించారు. దీనితో స్కాట్లాండ్ ఆశలు ఆవిరి అయ్యాయి.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: